అనుభవించని క్షోభ లేదు ,
అమ్మనాన్నలెవరో తెలియనందుకు...
అమ్మనాన్నలెవరో తెలియనందుకు...
ఆక్రోశించని క్షణంలేదు ,
మానసిక వేదన పంచుకోను మా కెవ్వరూ లేనందుకు ...
బాధ పడలేదు మేమెన్నడూ ,
ఏడంతస్తుల మేడ మాకివ్వనందుకు...
మానసిక వేదన పంచుకోను మా కెవ్వరూ లేనందుకు ...
బాధ పడలేదు మేమెన్నడూ ,
ఏడంతస్తుల మేడ మాకివ్వనందుకు...
చింతించలేదు మేమెన్నడూ ,
పంచభక్ష్యాలు మాకు అందనందుకు...
పంచభక్ష్యాలు మాకు అందనందుకు...
కలత చెందలేదు మేమెన్నడూ ,
కంచి వస్త్రాలు కట్టుకోలేనందుకు...
ఆవేదన చెందలేదు మేమెన్నడూ ,
ఓ తరువు నీడయినా మాకు దక్కనందుకు...
ఓ తరువు నీడయినా మాకు దక్కనందుకు...
నిరాశ చెందలేదు మేమెన్నడూ ,
అక్షరాస్యతను మాకు పంచనందుకు...
గుండె గూడు వేదనతో నిండగా ,
కన్నులు కడివెడు నీటితో నిండగా ,
చావని ఆశలు మనసులో నిండగా ,
కనులకు , మనసుకు పనులను చెబుతూ ...
కాళ్ళు , చేతులతో అసంకల్పితంగా...
వేదనతోటి వేసారిపోక వెదుకుతూనే ఉన్నాం...
నిర్జన , నిర్జీవ ప్రాంతంలో .....
మాకై పంపినదేమైనా దొరుకుతుందేమో అన్న ఆశతో....
అక్షరాస్యతను మాకు పంచనందుకు...
గుండె గూడు వేదనతో నిండగా ,
కన్నులు కడివెడు నీటితో నిండగా ,
చావని ఆశలు మనసులో నిండగా ,
కనులకు , మనసుకు పనులను చెబుతూ ...
కాళ్ళు , చేతులతో అసంకల్పితంగా...
వేదనతోటి వేసారిపోక వెదుకుతూనే ఉన్నాం...
నిర్జన , నిర్జీవ ప్రాంతంలో .....
మాకై పంపినదేమైనా దొరుకుతుందేమో అన్న ఆశతో....
****************
చదువుతుంటే...దుండె బరువెక్కుతుంది, నిస్సహాయత నిలదీస్తుంది.
ReplyDeleteమీ ఆలోచనలకు అభినందనలు దేవీ.
నిస్సహాయతతోనే ఇది రాసాను,అప్పటి నుండి మనసు స్తబ్ధుగా ఉంది మీరజ్.
Deleteకనులకు , మనసుకు పనులను చెబుతూ ...
ReplyDeleteకాళ్ళు , చేతులతో అసంకల్పితంగా...
మాకై పంపినదేమైనా దొరుకుతుందేమో అన్న ఆశతో....
చక్కని చిక్కని భావన శ్రిదేవి కలం నుంచి
అభినందనలు
అసహాయతకు రూపం ఈ నా భావాక్షరాలు చంద్రగారు.
Deleteశ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ
ReplyDeleteప్రభవించి నడిచిన భరత భూమి
వేదాది వాజ్ఞ్మయ విజ్ఞాన వీచికల్
పరిమళించిన జ్ఞాన భరత భూమి
బౌధ్ధాది మతముల వర బోధనామృత
ఫలములు మెక్కిన భరత భూమి
గాంధీ మహాత్ముని ఖడ్గమయి అహింస
పరుల చెండాడిన భరత భూమి
ఘనత బొగడంగ ఇదిగొ! ఈ కన్నులెదుట
‘సాక్ష్యముల్ వీధి బాలలు ఛాలు’ అదుగొ!
వచ్చు చున్నారు నేతలీ బ్రతుకు మార్చి
ఒనర బంగారు చేయగా ఓట్ల కొఱకు .
----- సుజన-సృజన
వెంకట రాజారావుగారు_/\_ నా బ్లాగుకు
Deleteస్వాగతమండి.ఓట్ల కొరకే,వారి బంగరు
భవిత కొరకు ఎంత మాత్రం కాదు .
మీ స్పందనలకు ధన్యవాదములు .