Tricks and Tips

Sunday, February 2, 2014

అల్లరి పిల్ల......!


గెంతుతు నా చెంతకు వచ్చిన అల్లరి పిల్లను చూచితిరా
మీరల్లరి పిల్లను చూచితిరా
నాపై అలకను పూని ఏ వల్లరి మాటున దాగున్నదో....

తెల్లని బొండు మల్లెలతో - విరిసీ విరియని జాజులతో
ఎర్రని ముద్ద మందారంతో - ఝుము ఝుమ్మనె తుమ్మెద నాదంతో
పచ్చని పావడ రెపరెపతో - పల్లెకు తెచ్చే అందాలే

బంగరు రంగు పైరులతో - జలజల పారే ఏరులతో
చల్లని పిల్ల తెమ్మెరతో - కుహుకుహు కోకిల గానంతో
ఘలుఘల్లనె కాలి అందెలతో -పల్లెకు తెచ్చే కళకళలే

భానుని లేత కిరణంతో -
నులివెచ్చని సాయం సంధ్యతో
 పున్నమి వెన్నెల రాతిరితో  - మిలమిలలాడే మిణుగురుతో
గలగల చేతి గాజులతో - పల్లెకు తెచ్చే మిలమిలలే

అల్లన మెల్లన వస్తోంది - నవవధువల్లే నడిచింది
అందాన్నెంతో తెచ్చింది - ఆనందాన్ని ఇస్తోంది
విరితావులనే తాకింది - విరిసీ విరియక  నవ్వింది
ఆ కోల కన్నుల భావాలు -  కొలవగ నెవరికి సాధ్యము .

***********

8 comments:

  1. ప్రకృతి తన అందాన్నంతా మీ అల్లరి పిల్లలో నింపేసినట్లుంది. ఆ అల్లరిపిల్లంత బాగుంది మీ కవిత

    ReplyDelete
    Replies
    1. ప్రకృతి మొత్తం తనదేనంటూ తిరుగుతుంటే మరి ప్రకృతి పరవశించిపోదా , తన అందాన్నంతా ఇచ్చేయదా..... హరిత మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete

  2. గెంతుతు నా చెంతకు వచ్చిన అల్లరి పిల్లను చూచితిరా
    మీరల్లరి పిల్లను చూచితిరా
    నాపై అలకను పూని ఏ వల్లరి మాటున దాగున్నదో....

    మల్లెలు, జాజులు, ముద్దమందారాలు, ఝుంఝుమ్మనే తుమ్మెద నాదాల పచ్చని పావడా రెపరేపలు .... ఎంత చక్కని భావన పల్లె పిలుస్తున్నట్లు, పలుకరిస్తున్నట్లు
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. నేను చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ పల్లెటూరెళితే అచ్చం అలానే ఉండేది చంద్రగారు.ఆ మధుర జ్ఞాపకాలే ఇలా ...నిజానికి ఇప్పుడు పల్లెలు ఇంతందంగా లేవు.ధన్యవాదములు చంద్రగారు.

      Delete
  3. అల్లరిపిల్లని చూశాను శ్రీదేవిగారు,నామదిలో..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు హిమజగారు,నా మదితో.

      Delete
  4. అల్లరిపిల్ల భలే ముద్దొస్తుంది

    ReplyDelete
    Replies
    1. అంతేగా మరి అల్లరి...అల్లరి అంటారుగాని ,అల్లరిపిల్లనే అందరూ ఇష్టపడతారు రాణీగారు .

      Delete