Tricks and Tips

Friday, February 7, 2014

ఓ మంచి పని చేయరా...


 చేయరా ! నీ చేతితో - ఓ మంచి  ని చేయరా...
చిన్నదైన , పెద్దదైన -  మంచిదైతే చాలురా.........
నిలుచురా నీ పేరు - ఓ మంచి పని చేయగా.......
నిలుపురా నీ కీర్తి - నీవున్నను , లేకున్నను ....

నాటరా ! నీ చేతితో - ఓ మంచి విత్తు నాటరా.....
చూడరా ! ఆ చెట్టు - నింగికేసి పెరిగెరా..............
నీడనిచ్చు ఆ చెట్టు - శ్రామికుల సేదతీర్చు .......
పూవులిచ్చు ఆ చెట్టు - పూజలే ప్రోత్సహించు ..
ఫలములిచ్చు ఆ చెట్టు - అన్నార్తులనాదరించు ..
 గింజలిచ్చి ఆ చెట్టు - తన సంతతిని విస్తరించు ..
పచ్చదనాల ఆ చెట్టు - ప్రాణి కోటి కాపాడు ........
అణువణువు ఆ చెట్టు - ఔషధాలు అందించు.....
కడకు కట్టెగాను - తన దేహమందించు ...........
మన కట్టె కాల్చుటకును - తన కట్టెలందించు ...
 మన చితిలో తోడై - కడవరకు నిలుస్తూ .........
మన కట్టెతో పాటుగా - సహగమనమే చేయు తుదకు 

చిన్న విత్తును చూడరా - ఓ మంచి మని చేయరా... 
చిన్నదైన , పెద్దదైన -  మంచిదైతే చాలురా.........
నిలుచురా నీ పేరు - ఓ మంచి పని చేయగా.......
నిలుపురా నీ కీర్తి - నీవున్నను , లేకున్నను ... 

*******

8 comments:

  1. చేయరా! నీ చేతితో ....... చిన్నదైన, పెద్దదైన ............ ఓ మంచి పని .......

    ఓ మంచి విత్తు నాటరా.....
    ఆ చెట్టు నీడనిచ్చు, సేదతీర్చు, పూవులిచ్చు, ఫలములిచ్చు, గింజలిచ్చి .... సంతతిని విస్తరించు!

    మంచి మాట లు నాలుగు పొందుపరిచి .... ఓ మంచి కవిత
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. మీ పచ్చని అభినందనలను ఆ చెట్టు సాక్షిగా అందుకున్నాను ధన్యవాదములు చంద్రగారు .

      Delete
  2. మీరు అక్షరాలను విత్తారు కదా, కావ్య వృక్షమై విస్తరిస్తుంది.
    చాలు ఇలాంటి నాలు అక్షర బీజాలు.
    అభినందనలు డియర్.

    ReplyDelete
    Replies
    1. మీ అభినందన ఆశీస్సులను అందుకున్నాను ధన్యవాదములు మీరజ్ .

      Delete
  3. Replies
    1. Welcome to my BLOG and thank you very much for your comments sir .

      Delete
  4. Replies
    1. శర్మగారు మీకు ఆసక్తి కలిగినందుకు ధన్యవాదములు .

      Delete