Tricks and Tips

Monday, February 10, 2014

అమ్మ


అమ్మ ముక్కోటి దేవతల ఏక స్వరూపం
"అమ్మా"అనే పిలుపే సకల పుణ్యతీర్ధం
అమ్మను సేవించుటయే సకల దేవతార్చనం

అమ్మ చూపులు అనురాగపు జల్లులు
అమ్మ పిలుపులు తేనెల చినుకులు
అమ్మ పనులు అలయని అలలు

అమ్మ కరుణ అనంత సాగరం
అమ్మ దీవెన అఖండ దీపం
అమ్మ హృదయం అమృత భాండం

అమ్మ జోల సుమధుర నాదం
అమ్మ ప్రేమ మాయని మమత
అమ్మ ఓదార్పు తరగని గని  

అమ్మ మాట పెట్టని కోట
అమ్మ బాట పువ్వుల తోట 
అమ్మ మనసు కట్టని కోవెల

*******

10 comments:

  1. అమ్మ అన్నదే ఓ కమ్మని మాట. అన్నరో కవి.
    మీ కవితలో అమ్మ కమ్మదనం తెలుస్తుంది,

    ReplyDelete
    Replies
    1. అమ్మ గూర్చి ఎంత చెప్పినా తక్కువే ,మీరజ్ మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete
  2. ఏం చెప్పినా ఎంత చెప్పినా ఏం ఇచ్చినా ఎంత ఇచ్చినా తీర్చుకోలేనిది అమ్మ ఋణమొక్కటే కాబోలు కవిత అమ్మ ప్రేమలా అమృతమయం గా ఉంది

    ReplyDelete
    Replies
    1. కాదనలేని వాస్తవాన్ని చెప్పారు హరిత ,ధన్యవాదములు.

      Delete
  3. అమ్మ అనేమాటే కమ్మనిది

    ReplyDelete
    Replies
    1. ఈ వాక్యం ఆ చంద్ర తారార్కం.......
      శర్మగారు చక్కగా చెప్పారు.
      మీరజ్ కూడా ఇదే భావం వ్యక్తం చేసారు.

      Delete
  4. అమ్మ గురించి విశ్లేషించే శక్తి, స్థాయి... ఇంకా నాకు రాలేదండి. మీరు బాగా రాశారు. నేను రాద్దామంటే.. ఎంత రాసినా ఏదో తక్కువ వెల్తి కనిపించి.. ఇక ఆ ప్రయత్నం విరమించుకున్నాను. అమ్మ.. అమ్మే కాబట్టి సాటి ఇక లేదు కాబట్టి.. ఇక రాయడమెందుకులే... మీరూ ఓ అమ్మ కాబట్టి.. మీలాంటి వాళ్లు రాసినపుడు చదివి మురిసిపోతుంటాను. చాలా బాగుందండీ...

    ReplyDelete
    Replies
    1. అమ్మ గూర్చి నా కన్నా మా అమ్మకు బాగా
      తెలుసు.మా అమ్మను అడిగితే ,నాకేం తెలుసమ్మా?
      మీ అమ్మమ్మకు బాగా తెలుసు అంటుంది.
      అమ్మమ్మను అడిగితే ,వాళ్ళమ్మకు బాగా
      తెలుసంటుంది......ఈ విధంగా అమ్మను గూర్చి
      ఎవరూ పూర్తిగా చెప్పలేరండి సతీష్ గారు....
      అది ఎప్పుడూ అసంపూర్ణమేనండి, కాబట్టి
      నాకు తెలిసినది మహా సింధువులో బిందువే
      అయినా రాశాను .

      Delete
  5. అమ్మ ప్రకృతి .... అమ్మ ప్రేమ .... అమ్మ ఒక అడగని వరం ....
    అమ్మ అనురాగ సాగరం .... అమ్మ హృదయం .... కోవేల లో ప్రమిదయ్యే భాగ్యం .... ఒక వరం
    అభినందనలు శ్రీదేవీ! శుభోదయం!

    ReplyDelete
    Replies
    1. అమ్మ హృదయం .... కోవెల లో ప్రమిదయ్యే భాగ్యం .... ఒక వరం
      చంద్రగారూ అపురూపమైన మీ అభినందనకు ధన్యవాదములు.

      Delete