Tricks and Tips

Monday, February 3, 2014

అందరూ చదవాలి .....

టీచరు జాబ్ వచ్చిందని
సంతసిస్తే సరిపోదు ,
పట్టుబట్టి టీచర్లంత
చదువు విలువ తెలపుదాం .

బడి ఈడు పిల్లల్ని
బడికి తీసుకొద్దాము ,
తీసుకొస్తే సరికాదు
నిలుపుదల చేద్దాము .

చిన్ని చిన్ని పిల్లల్లో
అంతులేని సామర్ధ్యం ,
సద్దు చేయకుంటుంది
తట్టి మనం లేపుదాం .

చేత బెత్తం పట్టవద్దు
విసుగుదల చూపవద్దు .
ఆటపాటలతోటి మనం
చదువు సంధ్య నేర్పిద్దాం .

మారుమూల పల్లె సైతం
చదువులోన ముందంజ ,
వేసేలా మనమంతా
చేయాలి శ్రమ ఎంతో .

వయసుతోటి పనిలేదు
మీరు కూడ చదువుకోండి ,
అంటు ఊరివారి కందరికి
అక్షరాలు నేర్పుదాము .

పేదలంటు,ధనికులంటు
భేదాలు విడిచి మనం ,
చదువులోన అందరిని
ధనికుల్ని చేద్దాము .

ఆ పిల్లలు వేరు కాదు
మన పిల్లలు వేరు కాదు ,
అందరూ మనవాళ్ళే
అనుకుంటే నేర్పగలం .

అందరికి చదువొస్తే
అనుకున్నది సాధిస్తాం ,
ప్రగతి బాటలోన మనం
పయనమే చేస్తాము .

ఏ ఒక్కరిదో కాదు ఇది
అందరిదీ బాధ్యతే ,
అందరూ చదవాలి
అందరూ ఎదగాలి .

******

6 comments:

  1. అందరూ చదవాలి
    అందరూ ఎదగాలి . nice

    ReplyDelete
    Replies
    1. రాజశేఖర్ గారు నా బ్లాగుకు స్వాగతం.మీ స్పందనలకు ధన్యవాదములు.

      Delete
  2. టీచరు జాబ్ .... చదువు విలువ తెలిపేందుకు, సామర్ధ్యం ను తట్టి లేపేందుకు, పేద ధనిక విచక్షణ లేని చదువును అందించేందుకు, ప్రగతి బాటలో పయనానికి పిల్లల్ని సమాయత్తం చెసేందుకు .... పురోగమనపదం వైపు

    చక్కని వాస్తవ చిత్రణ చదువుల సరస్వతి శపదం చేస్తున్నట్లు ....
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. ఎన్ని శపధాలు చేసుకున్నామన్నది కాదుకదా ముఖ్యం,ఏమి సాధించామన్నదే ముఖ్యం,ఏమైనా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోయాం కదా.మీ స్పందనలకు ధన్యవాదములు చంద్రగారు.

      Delete
  3. చదువు విలువను గురించి బాగా చెప్పారు శ్రీదేవి గారు..

    ReplyDelete
    Replies
    1. హిమజగారు మీ స్పందనలకు ధన్యవాదములు.

      Delete