Tricks and Tips

Friday, February 7, 2014

అల్లరి పనుల కృష్ణయ్యా ......

 అల్లరి పనుల కృష్ణయ్యా , నన్నలరించగ ఇటు రావయ్యా ,
చిలిపినగవుల చూపులతో నా చెంత చేరవయా ....

కోరి నిన్ను తలచేను , చెంత చేరి మొక్కేను ,
చిలిపిగ నన్ను  చేరరావయ్యా....చేరరావయ్యా
నన్ను  చేరరావయ్యా ...

వెన్నముద్దలు తెచ్చేను , గోరుముద్దలు పెట్టేను ,
మరువక నన్ను  చేరరావయ్యా...చేరరావయ్యా
నన్ను  చేరరావయ్యా.....

వలచి నిన్ను పిలిచేను , తలపులన్నీ నీకేను ,
విడువక నాతో ఉండి పోవయ్యా.... ఉండి పోవయ్యా
 నాతో ఉండి పోవయ్యా.... 

 అల్లరి పనుల కృష్ణయ్యా , నన్నలరించగ ఇటు రావయ్యా ,
చిలిపినగవుల చూపులతో నా చెంత చేరవయా .... 

***********

12 comments:

  1. ప్రేమ కవితాగానం బాగు బాగు

    ReplyDelete
    Replies
    1. నచ్చి స్పందించినందుకు ధన్యవాదములు పద్మార్పితగారు.

      Delete
  2. ఇంత ప్రేమగా పిలిచినా తరువాత ఆ కృష్ణయ్య రాకుండా ఉండగలడా? వచ్చాక వీడి వెళ్ళగలడా? చాలా బాగుంది

    ReplyDelete
    Replies
    1. ఒకసారి వచ్చాడు,ఇంటిపైన కట్టేసా ....
      ఇంకొకసారి వచ్చాడు,ఇంటిలో కట్టేసా...
      మళ్ళీ వస్తే శాశ్వతంగా కట్టేస్తా హరితా .

      Delete
  3. బృందావనంలో అలా విహరించినట్టుంది... శ్రీదేవి గారు...

    ReplyDelete
    Replies
    1. మీ వంటి ఉద్యోగస్తులకు ఇటువంటి బృందావనాల అవసరం ఎంతైనా అవసరం అనుకుంటాను సేద తీరడానికి . మీ స్పందనకు ధన్యవాదములు సతీష్ గారు .

      Delete
  4. ఈ రాధిక కి ఆ కృష్ణయ్య నచ్చకుండా ఉంటాడా ? బావుంది శ్రీదేవి గారు

    ReplyDelete
    Replies
    1. మీ కోసమే రాధికగారు నే రాసింది ,అలాగైనా నా బ్లాగును ప్రతిరోజూ చూస్తారనే ఆశతో....

      Delete
  5. అబ్బ ..ఎంతాశ!? పోటీకి మేమున్నాం. మా ఇంటికి రావాలని మా ఆశ :)

    బావుంది. మీ బ్లాగ్ , మీ వ్రాతలు అన్నీ బహు బాగు . keep it up.

    ReplyDelete
    Replies
    1. బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే
      ఎందుకే వనజా (గారు) ఈసునసూయలు........
      వనజగారు నా బ్లాగుకు స్వాగతం,మీ వంటివారి
      అభినందనలు అందుకోవడం చాలా ఆనందం.

      Delete
  6. వెన్నముద్దలు తెచ్చేను, గోరుముద్దలు పెట్టేను, వలచి నిన్ను పిలిచేను, తలపులన్నీ నీకేను, అల్లరి పనుల కృష్ణయ్యా, నన్నలరించగ ఇటు రావయ్యా,
    చిలిపినగవుల చూపులతో నా చెంత చేరవయా ....
    మనోహరంగా ఉంది భావన
    అభినందనలు శ్రీదేవీ!!

    ReplyDelete
    Replies
    1. కృష్ణుని గూర్చిన భావాలు ఎప్పుడూ మధురమే ,మనోహరమే చంద్రగారు మీ ఆత్మీయాభినందనలకు ధన్యవాదములు .

      Delete