Tricks and Tips

Wednesday, February 19, 2014

నేతల మొసలి కన్నీళ్ళు.......

మొన్నటి వకు నేతలకు......

చెవులకు పడ్డాయి దిబ్బళ్ళు ,
మూసుకు పోయాయి
కళ్ళు ,
మూతలు పడ్డాయి నోళ్ళు .

మూసుకు పోయాక వాకిళ్ళు.....

తొలగిపోయాయి
దిబ్బళ్ళు , 
తెరచుకున్నాయి కళ్ళు ,
అరుస్తున్నాయి నోళ్ళు .

రహదారికి అడ్డంగా రాళ్ళు ,
వాహనాలనడ్డుకోను తాళ్ళు ,
మూయబడ్డ స్కూళ్ళు .

పదవీ వ్యామోహ ఆకళ్ళు ,
నిరాశా నిస్పృహల లోగిళ్ళు ,
పోలీసు బలగాలతో కూడళ్ళు .
 
కార్చిన మొసలి కన్నీళ్ళు , 
రాజీనామాల గీకుళ్ళు ,
 చిత్తశుద్ధికి సంకెళ్ళు .
 
 

*******

10 comments:

  1. చాలా బాగా వ్రాశారు. ఇదంతా రాజకీయ కుళ్లు దీని వల్ల సమాజానికి ఎప్పుడూ అనారోగ్యమే. ఐనా సమాజానికి కుడా కుళ్ళు చెత్తచెదారం ఏమున్నా ముక్కుమూసుకుని దాని ప్రక్కనే కూర్చుని అన్ని పనులు చేసుకోవడం అలవాటే అంతే తప్ప ఎవ్వరికీ దాన్ని కడిగి పారేయాలన్న స్పృహ మాత్రం ఉండదు కనీసం కడిగే వాడికి సహకరిద్దామన్న ఇంగిత జ్ఞానం ఉండదు.

    ReplyDelete
    Replies
    1. ముక్కు మూసుకోవడమా? కొంత మంది మనుషులు సీతాకోకచిలకల్లా మకరందాన్ని ఆస్వాదిస్తుంటే.....మిగిలిన వారంతా ఈగల్లా మలినాలు ఏరుకోవడంలో మునిగి పోతుంటే ఇంక ముక్కు మూసుకోవడం అవసరమా హరితా?

      Delete
  2. ఏమి చెప్పాలో తెలీటం లేదు, నా ఓటు మీకే...

    ReplyDelete
    Replies
    1. మీరజ్ ,నాకూ రాజకీయాల పట్ల ఆశక్తి లేదు...కానీ మరీ నిరక్షరాస్యులను పూర్వం భూకామందులు బానిసల్లా వాడుకున్న మాదిరిగా...ప్రజాస్వామ్య రాజ్యమేనా ,మనం చదువుకున్న వాళ్ళమేనా,ఇచ్చిన మాట ప్రకారం చర్చలు జరపకనే...ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి ........రాస్తూ పోతే చాలా ఉంటుంది,విడిపోవడమనేదాని గురించి కాదు,ఎలాంటి విధానం పాటించారు అనేది జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది,మనకు కష్టం వస్తే అమ్మకు చెబుతాం...అమ్మే కష్టపెడితే ఎవరికి చెప్పుకుంటాం...అలా ఉంది.ఏదేమైనా ఇటువంటివారిని మనం ఎన్నుకోవడం హేయకరమైనదిగా భావిస్తున్నాను.

      Delete
  3. మరి ఎవరికి ఓటేద్దాం?

    ReplyDelete
    Replies
    1. చిరంజీవిగారు నా బ్లాగుకు స్వాగతం.
      ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది
      గర్వకారణం?ఎవరికి ఓటు వేసినా చరిత్ర
      పునరావృతమవుతుంది,ఎందుకంటే
      ప్రజల్లో ఆశలు నింపి గెలిచిన వాడల్లా
      విలీనం అంటూ మనం వ్యతిరేకించిన
      పార్టీలో కలిపేస్తాడుగా,కారణాలను దీర్ఘాలు
      తీస్తూ చెప్పేసి అయిదేళ్ళు గడిపేస్తాడుగా,
      మరీ బాగోదనుకుంటే ఒక్క నెల ముందు
      త్యాగం చేస్తున్నట్లుగా రిజైన్ చేస్తాడుగా,
      ఓటుకు విలువలు చెల్లిన ఈ కాలంలో మీరు
      వేసిన ప్రశ్నకు జవాబు దొరకడం జరగదేమోనండి.

      Delete
  4. మనసు మూగగారోదించె!

    ReplyDelete
    Replies
    1. ప్రకృతిలో వచ్చే పెను మార్పులను సైతం
      తెలుసుకుని మనను మనం కాపాడుకునే
      ఈ రోజుల్లో రాజకీయనాయకులలోని వికృత
      చేష్టలు తెలుసుకోలేక నివ్వెరపోయి,
      నిశ్చేష్టులమై,నిలువునా నీరుగారిపోతూ
      ఇలా మూగగా కలంతో రోదిస్తూ..శర్మగారు
      పూర్వకాలంలో రాక్షసులంతా ఈ కాలంలో
      ఇలా రాజకీయనాయకుల్లా పుట్టారా అని
      నా అనుమానం.....కాదు నమ్మకం.

      Delete
  5. అన్నీ ముందుగానే తెలిసిన నేతలు .... ఏదీ తెలిసినట్లు మాట్లాడరు. ఎంతో అమాయకత్వం నటిస్తారు. అమాయకుల్ని నమ్మించడానికి అలా నటించడం చాలా అవసరమని తెలిసు కనుకే ఆ నేతలు అలా ముసలి కన్నీళ్ళు కారుస్తుంటారు.

    వాస్తవాల్ని కళ్ళకు కట్టి చూపించిన చక్కని కవిత
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. అదృష్టహీనులు,దురదృష్టవంతులు....
      నిజజీవితం ఒకటుంటుందని మరచిపోయి
      జీవితాంతం నటిస్తూనే బ్రతుకుతారు....
      (వెండితెర నటులుకాదు,రాజకీయనేతలు)
      చచ్చే ముందు కూడా మనసారా మాట్లాడుకోలేరు,
      ఎందుకంటే వారికి సహజ మరణం ఉండదుగా,
      అటువంటి వాడికి సహజ జీవితం,
      సహజ బంధాలు,సహజ కన్నీరు విలువలేం
      తెలుస్తాయీ.మొసలికన్నీరు కార్చడం తప్ప.
      చంద్రగారు అభినందనకు ధన్యవాదములు.

      Delete