Tricks and Tips

Tuesday, February 11, 2014

నా మనసు విపంచిలా....


నీ ఆగమనంతో.....
నా ఒంటరితనమే విరిసిన పూల వనమయ్యింది ,
నా కనులు విప్పారి తారకల్లా మెరిశాయి ,
నా పెదవులు సుడివిడి అలల్లా సాగాయి ,
నా భావాలు కూనిరాగాలై పరవశించాయి ,
నా మనసు విపంచిలా విను వీధుల్లో విహరించ సాగింది .

*******


18 comments:

  1. ఆనందం మీ కవిత లో పల్లవించింది .. నా మది సైతం మీతో శృతి కలిపింది

    ReplyDelete
    Replies
    1. మరి గానామృతాన్ని కురిపించేద్దామా,
      ఆలస్యమెందుకు ?రండి ముందుకు.....
      మీ అభినందనకు సంతోషం రాధికా, .

      Delete
    2. నేను సిద్ధమే శ్రీదేవి గారు

      Delete
    3. మీ స్పందనకు ధన్యవాదములు రాధికా.

      Delete
  2. నాకు నచ్చలేదు , నా దేవికి ఇంకెవరి రాకో నచ్చటం :-((

    ReplyDelete
    Replies
    1. అవునా మీరజ్ ! ఈ సారికి ఇలా కానివ్వండి
      రాసేశానుగా,ఇంకోసారి మాత్రం మీ కోసమే
      ఎదురు చూస్తా సరేనా :-)

      Delete
  3. 6 లైన్లలో అనంతమైన ఆనందాన్ని అందంగా చెప్పేశారు చాల బాగుంది

    ReplyDelete
    Replies
    1. ఆరు పదాల్లో చెప్పేటంత గొప్ప వాళ్ళున్న...
      ఈ బ్లాగుల్లో నాదో సామాన్యమైన భావం.
      అభినందనకు సంతోషం హరిత.

      Delete
  4. విపంచై ఇలా ఆనందంగా విహరించండి......కవిత కడు కమ్మగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనకు సంతోషం పద్మార్పితగారు.
      విపంచిలా విహరించాలనే ఉంది కానీ ,
      మీరజ్ అలిగారుగా అని ఆలోచిస్తున్నా...

      Delete
  5. విపంచిలా...మా దేవీ, విరిలా.. మా పద్మా..., ఇలా కలకాలం మచి కవితలు రాస్తుంటే విరించి కూడా విస్మయం పొందుతాడు..:-))

    ReplyDelete
    Replies
    1. విరి + విపంచి = విరించి ( బ్లాగు సంధులు )
      టీచర్ గదా !అందుకే ఇంత వివరంగా చెప్పారు.
      మీరజ్ ధన్యవాదములు.

      Delete
  6. మంచి అని సరిదిద్దుకోండమ్మా...

    ReplyDelete

  7. నా ఒంటరితనమే విరిసిన పూల వనమయ్యింది ,
    ............ మనసు విపంచిలా విను వీధుల్లో విహరించ సాగింది ..... నీ ఆగమనంతో
    చక్కని భావన
    చాలా బాగుంది .... అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనాగమనం నాకెంతో సంతోషం చంద్రగారు.

      Delete
  8. Replies
    1. వనజగారు మీ అభినందనకు ధన్యవాదములు.

      Delete