Tricks and Tips

Saturday, February 22, 2014

కన్నులలో నా మామా......

వెన్నెలలో నా మామా ,
వదలకురా నా మామా ,
మబ్బుల్లో నా మామా ,
దాగొనక రా మామా ,

కాటుక కనులు నా మామా ,
కాంచెను నిన్ను నా మామా ,
కన్నులలో నా మామా ,
నీ కనులుంచు నా మామా ,

చేతి గాజులు నా మామా ,
చేర పిలిచే నిన్నేమామా ,
చేతులలో నా మామా ,
నీ చేతులుంచు నా మామా ,

కాలి అందెలు నా మామా ,
కాపు కాసే నీకై మామా ,
అందెలలో నా మామా ,
నీ అడుగులుంచు నా మామా ,

జడలో జాజులు నా మామా ,
జాలిగ చూచే
నిన్నేమామా ,
జాజులలో నా మామా ,
నీ మోజులుంచు నా మామా ,

మనసంతా నా మామా ,
మరులేరా నా మామా ,
మనస్సులో నా మామా ,
నీ మనసుంచు నా మామా ,

అందాల నా మామా ,
అందమైన నా మామా ,
అందంతో నా మామా ,
అలరించు చందమామ .

******

4 comments:

  1. అందాల ఓ మామా మా దేవి ఇంట అడుగిడు మామా.,
    కోపాలనూ,తాపాలనూ తుడిచేసి, వెన్నెలలో ఆడించు మామా.:-))

    ReplyDelete
    Replies
    1. మీరింతగా చెప్పాక రాకుండా ఎలా ఉంటాడు,
      అదిగో వచ్చేసాడు మబ్బుల చాటునుండి...
      కిటికీలోనుండి లోపలికి...చల్లగా,మెల్లగా
      మీరజ్ పంపించినందుకు సంతోషం.

      Delete
  2. వెన్నెలలో, మబ్బులలో .... దాగుకొనక రా నా మామా! కాటుక కన్నులు, చేతి గాజులు, కాలి అందెలు, జడలో జాజులు ఎదురుచూస్తున్నాయి .....
    మనసంతా నా మామా నీ మనసుంచు నా మామా .....
    అందాల మామా అందమైన మామా .....
    అలరించు నా చందమామ .
    జానపద భావమాధుర్యాన్ని మరోసారి .... "కన్నులలో నా మామా......" లో
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. చందమామపై మనం ఎంత రాసుకున్నా తక్కువేనేమో అనిపిస్తుంది.చంద్రగారు మీ అభినందనకు ధన్యవాదములు.

      Delete