Tricks and Tips

Wednesday, February 26, 2014

జామురాతిరిలోనా........


తలగడ మీద తలవాల్చగనే ,
తలపుల తలపులు విచ్చుకుని ,
వలపుల విరులు విరిసినవి ,
నా తనువున విరుపులు తెచ్చినవి ,
చింత తీర్చగ రావా నా మామా....

కన్నుల మెరుపుల లోన ,
కురిసిన వెన్నెలలోనా ,
గాజుల గలగలలోనా ,
చిరుగాలి సవ్వడిలోనా ,
దోబూచులాడక రావా నా మామా ...

జామురాతిరిలోనా ,
జారిన మల్లెలలోనా ,
ఎదలో రొదలలోనా ,
వేగే విరహంలోనా ,
జాగు చేయక రావా నా మామా...

కలత నిద్దుర లోనా ,
కలవరింతలలోనా ,
మధురభావనలోనా ,
నా గుండె గూటిలోనా ,
ఉండిపోక రావా నా మామా...

రావా రావా నా మామా ,
చెంత చేరగ రా మామా ,
చిలిపి నవ్వుల నా మామా ,
చల్లగ మెల్లగ రా మామా ,
అందాల నా చందమామా... 
*******

4 comments:

  1. Replies
    1. సుందర్ గారు నా బ్లాగుకు స్వాగతం.మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

      Delete

  2. కన్నుల మెరుపుల కురిసిన వెన్నెలలో, గాజుల గలగలలో, చిరుగాలి సవ్వడిలో, దోబూచులాడ
    జామురాతిరిలో, జారిన మల్లెలలో, ఎదలో రొదలలో, విరహంలో జాగు చేయక
    కలత నిద్దుర లో, కలవరింతలలో, మధురభావనలలో, గుండె గూటిలో, ఉండిపోవగ ....
    రావా నా మామా!
    చల్ల చల్లగ మెల్ల మెల్లగ రావా మామా, అందాల నా చందమామా!!
    ఎంత చక్కని ఆవాహం ....
    అభినందనలు శ్రీదేవీ! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. నేను అలసిపోకుండా చందమామను ప్రతిరోజూ పిలుస్తూనే ఉన్నాను,మీరూ అలసిపోకుండా ప్రతిరోజూ అబినందిస్తూనే ఉన్నారు చంద్రగారు ధన్యవాదములు.

      Delete