Tricks and Tips

Sunday, February 16, 2014

గాజుల శ్రీదేవి గాజులు.......

గాజులండీ , గాజులు - అందమైన గాజులు ,
 రంగురంగుల గాజులు - రండీ ,కొనండి గాజులు ,
వేసుకొనండీ గాజులు - వేయి రకాల  గాజులు ,

ఎర్రఎర్రని  గాజులు - పండు ముత్తైదు గాజులు ,
చిలకపచ్చని గాజులు - చిన్నపిల్లల గాజులు ,
 చిలిపిగ మోగే గాజులు - ఎందరో మెచ్చే గాజులు ,

నీలి నీలి  గాజులు  - మరదలు మెచ్చే గాజులు ,
పసుపు పచ్చని  గాజులు - పిన్నికి నచ్చే గాజులు ,
పలకరించే గాజులు -నిండుగ నవ్వే గాజులు
 
ఆకుపచ్చని గాజులు - ఆడబిడ్డ గాజులు ,
తొలివెలుగంటి గాజులు - తోడికోడలి  గాజులు ,
అందం పెంచే  గాజులు  - అందరికిష్టం  గాజులు ,

అరుణ కాంతి గాజులు - అత్తగారి గాజులు ,
మువ్వన్నెల గాజులు - ముద్దుల కూతురి గాజులు ,
ముచ్చట గొలిపే గాజులు - ముద్దుగ మోగే గాజులు ,

పంచవన్నెల గాజులు - పడతి మెచ్చే గాజులు ,
గంధం రంగు గాజులు - గడసరి పిల్లల  గాజులు ,
గలగల మోగే  గాజులు -  మోజులు పెంచే గాజులు ,

మేఘ  వర్ణం గాజులు - మేనత్త గాజులు ,
బంగరు రంగు గాజులు - భర్త మెచ్చే గాజులు ,
పిలచి వలచే గాజులు - పెంచే అందం గాజులు ,

అలరించే గాజులు - అతివకు అందం గాజులు ,
అలలా కదిలే గాజులు - అందరు మెచ్చే గాజులు ,
అందరికిష్టం గాజులు - గాజుల శ్రీదేవి గాజులు

********















8 comments:

  1. మీ దగ్గర వ్యాపార రహస్యాలు నేర్చుకోవలసిందే :)

    ReplyDelete
    Replies
    1. శర్మగారు ధన్యవాదములు.అయినా
      పెద్దవారు కనుక అడిగితే చెప్పకుండా
      ఎలా ఉంటాను?ఇదిగో వినండి.................
      ష్...ష్ ఎవరికీ చెప్పొద్దే వ్యాపార రహస్యం.

      Delete
  2. అమ్మో...దేవీ, ఇక బయమే లేదు నాకు ఓ మంచి బిజినస్ పార్ట్నర్ దొరికింది.
    కానీ ప్రై పదాన గాజులతో పాటు ముత్యాలు మెరుస్తున్నాయి డియర్.

    ReplyDelete
    Replies
    1. మీరజ్ ఇక చార్మినార్ వద్ద గాజుల బజార్లన్నీ దివాళాయే.....
      గాజుల వారి గాజులా మజాకా .....

      Delete
  3. రాజుల కాడి నుండి
    నాబోటి వాడి దాకా
    ఎవరికీ నారాజు చేయకుండా
    విరాజిల్లే గాజుల చార్మ్
    చార్మినారు గాజుల్లో కూడా లేదేమో
    శ్రీదేవి గారు....
    మొత్తానికి
    సార్ధక నామధెయురాలనిపించారు లెండి..
    హహహ....

    ReplyDelete
    Replies
    1. మరి గాజుల కున్న మహత్మ్యమే అదండి జానీగారు .

      Delete
  4. గాజులండీ , గాజులు - అందమైన గాజులు, రంగురంగుల గాజులు .... ఎర్రఎర్రని గాజులు, చిలకపచ్చని గాజులు, నీలి నీలి గాజులు, పసుపు పచ్చని గాజులు, ఆకుపచ్చని గాజులు, తొలివెలుగంటి గాజులు, అరుణ కాంతి గాజులు, మువ్వన్నెల గాజులు, పంచవన్నెల గాజులు, గంధం రంగు గాజులు, మేఘ వర్ణం గాజులు, బంగరు రంగు గాజులు,
    అతివకు అందం గాజులు ,
    అందరు మెచ్చే గాజులు ,
    గాజుల శ్రీదేవి గాజులు
    గాజులండీ , గాజులు - అందమైన గాజులు, రంగురంగుల గాజులు
    ఇక్కడ హైదరాబాద్ లో చార్మినార్ వద్ద నాణ్యమైన గాజులు దొరుకుతాయి అంటారు. గాజుల ప్రపంచంలోకి తీసుకెళ్ళావు.
    అభినందనలు శ్రీదేవీ! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. గాజుల శ్రీదేవి ఇన్ని గాజుల గూర్చి చెప్పినా ఇంకా చార్మినార్ గాజులు బాగుంటాయనడం నాకు నచ్చలేదు చంద్రగారు :-((

      Delete