Tricks and Tips

Tuesday, June 17, 2014

నిస్వార్ధ నిరీక్షణ..........

నిరీక్షణ..........
నిరంతర నిరీక్షణ..........
అనంతమైన నిరీక్షణ..........
రైతన్న నిరీక్షణ..........

కంటిలోని తడి ఆరినా ,
ఆశల జడి ఆగక నిరీక్షణ..........

సూటిగ సూర్యకిరణాలు ధాటిగా గుచ్చుతున్నా ,
చేతిమాటుగా నింగికేసి నిరీక్షణ..........

బీటలు వారిన భూమిపై చతికిలబడి ,
తొలకరిజల్లులకై నిరీక్షణ..........

మృగశిరకార్తెలో వడగాడ్పులలో ,
వడలిన వదనాలతో నిరీక్షణ..........

రైతన్నా నీ నిరీక్షణ ,
నిస్వార్ధ నిరీక్షణ..........

కావలె నీ నిరీక్షణ సఫలం ,
మా జీవం ఫలించిన నీ నిరీక్షణా ఫలితం .


 **********

4 comments:

  1. రైతన్న నిరీక్షణ పలించాలి , అందరూఒ అన్నం తినగలగాలి

    ReplyDelete
    Replies
    1. మీరజ్ మీ అభినందనలకు ధన్యవాదములు .

      Delete
  2. బీటలు వారిన భూమిపై చతికిలబడిన ఆశ, నీ రేపటి జీవితం ప్రకృతి పరామర్శ తొలకరిజల్లులకై నిరీక్షణ..........
    భూమి పుతృడి బాధ అర్ధం చేసుకుని ఆ వరుణుడు కటాక్షించాలని ఆకాంక్షిస్తూ
    అభినందనలు శ్రీదేవీ! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ అభినందనలకు ధన్యవాదములు . నిజంగా ఈ సంవత్సరమంత దారుణమైన పరిస్థితులు నేనింత వరకు చూడలేదు , పసిపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఈ ఎండలకు తల్లడిల్లిపోతున్నారు.

      Delete