Tricks and Tips

Sunday, June 1, 2014

నిష్ప్రయోజన రోదన............

 అమ్మ ......
నిను కనిపెంచిన అమ్మ ,
నీ అవసరాల్ని తీర్చిన అమ్మ ,
నిను కంటికి రెప్పలా చూసిన అమ్మ ,
నీకై నిదురను కాచిన అమ్మ ,
నీకై చేతులు చాచి యాచించిన అమ్మ ,
నీ ఆకలి తీర్చి , పస్తులున్న అమ్మ ,
నీకై పుస్తెలు అమ్మిన అమ్మ ,
నిను గుండెగూటిలో దాచిన అమ్మ .
 

ప్రతి రోజు నా బిడ్డ  పది కాలాల పాటు
చల్లగా వుండాలని , నిర్విరామంగా కోరుకునే 

నీచే గెంటివేయబడిన అమ్మ....
చెట్టు నీడన కూర్చుని ఆకాశం కేసి ఆశగా చూస్తూ ,
తన బిడ్డకు దీవెనలిమ్మని ఆ దేవుడిని
 వేడుకుంటోంది వేసారిపోక ....
 
ఆ గుండెగూటి కన్నా నీవు కట్టుకున్న ఏ భవనాలూ
ఏమంత గొప్పవి కాదని తెలుసుకున్న రోజున ,
తిరిగిరాని లోకాలకెళ్ళిన తల్లిని తలచుకుని ,
బరువెక్కిన హృదయంతో మౌనంగా రోదిస్తావు ,
కానీ సమయం మించిపోతుంది ,
నీ రోదన నిష్ప్రయోజనం . 

******

6 comments:

  1. ఆ తర్వాత ఏడిచి ఏమి లాబం.
    ఈ సమాజం, ఆలోచనలూ మారాలి, అమ్మకి ఆర్దిక స్థోమత ఉండాలి.

    ReplyDelete
    Replies
    1. ఆర్ధికస్థోమత ఉన్న అమ్మకైనా రక్షణ లేకుండా పోతోంది మీరజ్ "కన్నబిడ్డలు"కార్చే మొసలి కన్నీళ్ళతో..............

      Delete
  2. ఏడుపుగొట్టు వెధవలు విడిపొయినందుకు చాలా, చాలా ఆనందంగా వుంది. ఇన్నాళ్ళు అబద్దాలు, విషం, విద్వెషాలా మధ్య మనం సాధించిందంత అప్పనంగా సాని దాని అండ చూసుకొని దోచుకున్నారు తెలబాన్లు. కాని ఆంద్రులకున్న ఏకైక ఆస్తి వాళ్ళ శ్రమ, కష్ట పడే తత్త్వం, సాహసం, ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. విద్యుత్, నీళ్ళు, ఆంధ్రుల శ్రమతొ నిర్మించిన హైదరబాద్ దోచుకున్నా తెలబాన్లలొ ఇంకా అభద్రతా భావం ఎందుకు? వాళ్ళకు భయం, అందుకే వాళ్ళకు అలవాటైయిన ఏడుపు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. అసూయ, ద్వెషాలతొ రగిలిపోతున్నారు. ఒకటి మాత్రం నిజం, తెలబాన్లు పాకిస్తాన్లా తయరవుతారు, వాళ్ళకి ఆంధ్రుల మీద ద్వెషం లేకపోతే మన లేరు

    ReplyDelete
    Replies
    1. rome neo గారు నా బ్లాగుకు స్వాగతం . మీ కామెంట్ నా రచనకు సంబంధించినదిలా లేదు ,మీకు నా ధన్యవాదములు.

      Delete
  3. బిడ్డలు బాగుండాలని అహరినిశలు ఆరాటం చెందే అమ్మకు కూడా ఆసరా అవసరమని నీదైన శైలి లో చక్కగా భావూకరించావు.
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ అభినందనలకు ధన్యవాదములు .

      Delete