నా వంక సూడరాదటే ఓ పిల్లా
నా తోటీ పలకరాదటే ఓ పిల్లా
సేయి సేయి కలపరాదటే ఓ పిల్లా
నా జీవితాన తోడు రావదే ఓ పిల్లా ll నా వంక ll
ఆ సూరీణ్ణి తెచ్చినానే ఓ పిల్లా
నీ సింధూరం చేసినానే ఓ పిల్లా
ఆ కరిమబ్బుల్ని తెచ్చినానే ఓ పిల్లా
నీ కాటుక చేసినానే ఓ పిల్లా ll నా వంక ll
ఆ నెలవంకనీ తెచ్చినానే ఓ పిల్లా
నీ నవ్వుకు అద్దినానే ఓ పిల్లా
ఆ తారల్ని తెచ్చినానే ఓ పిల్లా
నీ కొప్పులో తురిమినానే ఓ పిల్లా ll నా వంక ll
ఆ ఇంద్రధనస్సు తెచ్చినానే ఓ పిల్లా
నీ చీరగా మలచినానే ఓ పిల్లా
ఆ మెరుపుతీగల్ని తెచ్చినానే ఓ పిల్లా
నీ మేని వంపుల్లో ఉంచినానే ఓ పిల్లా ll నా వంక ll
నా మనసు తెచ్చినానే ఓ పిల్లా
నీ మనసుకిచ్చినానే ఓ పిల్లా
నా ఇంటి దారిలోన ఓ పిల్లా
నీకై మల్లెల్ని పరచినానే ఓ పిల్లా ll నా వంక ll
నా తోటీ పలకరాదటే ఓ పిల్లా
సేయి సేయి కలపరాదటే ఓ పిల్లా
నా జీవితాన తోడు రావదే ఓ పిల్లా ll నా వంక ll
ఆ సూరీణ్ణి తెచ్చినానే ఓ పిల్లా
నీ సింధూరం చేసినానే ఓ పిల్లా
ఆ కరిమబ్బుల్ని తెచ్చినానే ఓ పిల్లా
నీ కాటుక చేసినానే ఓ పిల్లా ll నా వంక ll
ఆ నెలవంకనీ తెచ్చినానే ఓ పిల్లా
నీ నవ్వుకు అద్దినానే ఓ పిల్లా
ఆ తారల్ని తెచ్చినానే ఓ పిల్లా
నీ కొప్పులో తురిమినానే ఓ పిల్లా ll నా వంక ll
ఆ ఇంద్రధనస్సు తెచ్చినానే ఓ పిల్లా
నీ చీరగా మలచినానే ఓ పిల్లా
ఆ మెరుపుతీగల్ని తెచ్చినానే ఓ పిల్లా
నీ మేని వంపుల్లో ఉంచినానే ఓ పిల్లా ll నా వంక ll
నా మనసు తెచ్చినానే ఓ పిల్లా
నీ మనసుకిచ్చినానే ఓ పిల్లా
నా ఇంటి దారిలోన ఓ పిల్లా
నీకై మల్లెల్ని పరచినానే ఓ పిల్లా ll నా వంక ll
***********
ReplyDeleteసూరీణ్ణి తెచ్చి సింధూరం చేసి .... కరిమబ్బుల్ని తెచ్చి కాటుక చేసినాను.
నెలవంకనీ తెచ్చి నవ్వుకు అద్ది, తారల్ని తెచ్చి కొప్పులో తురిమినాను.
ఇంద్రధనస్సు తెచ్చి చీరగా మలచి, మెరుపుతీగల్ని తెచ్చి మేని వంపుల్లో ఉంచినాను.
మనసు తెచ్చి మనసుకిచ్చి, ఇంటి దారిలో మల్లెల్ని పరచినాను ....
ఓ పిల్లా!
నా వంక సూడరాదా! నా తోటీ పలకరాదా! సేయి సేయి కలపరాదా! నా జీవితాన తోడు రావా!
ఓ పిల్లా!
ఓ పిల్లా అంటూ అన్నీ సమకూర్చుకున్న వైనం జానపదం గా చాలా బాగా రాసావు శ్రీదేవీ!
అభినందనలు!
చంద్రగారు మీ ప్రోత్సాహక అభినందనలకు ధన్యవాదములు .
Delete