Tricks and Tips

Friday, March 14, 2014

ఆ గళ్ళ చీర...


శ్రమజీవులు తరిగిపోయి ,
భూమిలో నీరు ఇంకిపోయి ,
భూదేవి కట్టెనా ఆవేదనతో ,ఆ గళ్ళ చీర... 

********


8 comments:

  1. ప్రతి చిరుగూ....(పగులు) అన్నదాత కన్నీటితో తడుస్తుంది.
    దేశమాతకి చిరుగు చీరకట్టినట్లుంది

    ReplyDelete
    Replies
    1. అన్నదాత కన్నీటితోనన్న తడుస్తుందనే ఆశలేదు మీరజ్,అన్నదాత కంటిలో నీరు కూడా ఎండిపోయిందిగా.

      Delete
  2. మనసు కరిగి జారే అశ్రుబిందువులు కండ కరిగి జారే స్వేదబిందువులు ఒక్కసారి ఆ నేలను తాకితే చాలు తిరిగి పచ్చని చీరతో ముత్తైదువ కాదు నా నేల తల్లి

    ReplyDelete
    Replies
    1. అశ్రుబిందువులు,స్వేదబిందువులు కాలుష్యానికి ఎప్పుడో ఆవిరైపోయాయి హరిత.

      Delete
  3. ఆ గళ్ళ చీర
    భూదేవి ఆకళ్ళ చీర
    ఆకటి నెగళ్ళ చీర
    వళ్ళంతా కళ్ళు చేస్కుని
    ఫెళ్లుమని పగుళ్ళు చీల్చుకుని
    బీళ్ళు తెరుచున్న బీడు చీర

    ReplyDelete
    Replies
    1. చాలా బాగా వ్యక్తం చేశారు జానీగారు బీడునేల గూర్చి,ధన్యవాదములు.

      Delete
  4. అస్పృశ్యత అవినీతి కుల మత స్వార్ధ రాజకీయ విద్రోహకాలు పెరిగి ఎండిపోయి శాంతి మమతానురాగాలు కరువై పగిలిన భూమాత గుండెలవి .... శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. వైషమ్యాలు అంతకంతకు పెరిగిపోతుంటే ఆవేదనతో తనలోని నీరంతా ఆవిరైపోగా భూదేవి నిలిచిందిలా.....చంద్రగారు మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete