Tricks and Tips

Thursday, March 6, 2014

ప్రకృతిలోన గూడులా......

అదిగదిగో మా ఇల్లు ,
అందాల మా ఇల్లు ,

ప్రకృతిలోన గూడులా ,
మొక్కల నడుమ మొగ్గలా ,

నిశ్చల ప్రశాంత వనంలో ,
నిర్మలమైన రూపంలో ,

ఆకుపచ్చని వనంలో ,
ఆ వనకన్యల నడుమన ,
  
భ్రమరనాదములతో ,
ఆమని కోయిల కూతలతో ,

చల్లని మంచు బిందువులతో ,
 భానుని లేత కిరణములతో ,

చల్లని పిల్లతెమ్మెరలతో ,
విరిసిన పూమొగ్గలతో ,

చిరు వెచ్చని సాయంసంధ్యలతో ,
తారాచంద్రుల లీలలతో,

ఆకాశం క్రింద సంతోషంగా ,
ఆనందంగా విహరించనా ,
 
ఆదమరచి నే నిదురించనా ,
అందమైన కలలు కననా . 

*******


4 comments:

  1. సఖియా...నిదురించవే..,
    కలలోన ఆ సామాజిక రుగ్మతులను గూర్చి వివరించవే..:-))

    ReplyDelete
  2. ఆ రుగ్మతలను రూపుమాపలేకనే అందమైన ఇల్లును అడ్డం పెట్టుకుని పారిపోతున్నాను మీరజ్.

    ReplyDelete
  3. ప్రకృతి సోయగాల నడుమ చల్లని పర్ణశాలా
    మనసు బాధను పెకిలించే నిత్య నిర్మల కుటీరం
    బహుశ.. మనషి మనసు కూడా ఆ లోగిలిలా నిర్మలంగా ఉండాలనే భావనను కొనియాడేటట్టు రాసినట్టున్నారు శ్రీదేవి గారు, మంచి మంచి ఆలోచనలు వ్యక్త పరిచారు మీరు. ది వే అఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ రియల్లీ మర్వెలస్ మాడం. కుడోస్ టు యు

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్ గారు ధన్యవాదములు.

      Delete