Tricks and Tips

Wednesday, March 5, 2014

తోడు దొంగలం ఇద్దరమూ......

అమ్మా ! 
నీ గాజుల సవ్వడి నాకెరుకే ,
నీ అందెల స
వ్వడి నాకెరుకే ,
 
నీ పిలుపులో ప్రేమ నాకెరుకే ,
నీ ముద్దులో భావం నాకెరుకే ,
 
నీ ఒడిలో ఒంపులు నాకెరుకే ,
నీ గుండెలో స్పందన నాకెరుకే ,
 
నీ చేతుల స్పర్శ నాకెరుకే ,
నీ చూపులో కరుణ నాకెరుకే ,
 
నీ జోల ఊపులో వేగం నాకెరుకే ,
నీ జోలాలి మధురం నాకెరుకే ,
 
నీ అనురాగమంతా నాకెరుకే , 
నీ అనుబంధమంతా నాకెరుకే ,
 
నా ఆకలి సంగతి నీకెరుకే , 
నా అల్లరులన్నీ నీకెరుకే ,
 
నీ మదిలో చోటు నా కొరకే ,
నా మదిలో చోటు నీ కొరకే ,
 
ఒకరికి ఒకరం దొరికాము ,
తోడు దొంగలం ఇద్దరమూ......

 
********

12 comments:

  1. చాలా బాగుంది బుజ్జిగాడి అల్లరి అమ్మ మురిపెం. చిన్నప్పుడేమో ముద్దు మురిపాలు మూటలుకట్టి పంచుతారు, పెద్దయిన తర్వాత బాధలన్నీ మూటకట్టి నెత్తిన పెడతారు

    ReplyDelete
    Replies
    1. అయ్యో హరితా!ఏ పుట్టలో ఏ పామున్నదో.....
      పాపం బుజ్జిగాడి మీద అంత నెపం వేయడం బాగోలేదు......
      మరొక్కసారి ఆలోచించాలి......బుజ్జిగాడి కోసం

      Delete
  2. హహ ఇద్దరూ ఇద్దరే
    ఒకరి అచ్చటా మరొకరికి ముచ్చటా
    ఒకరి ముచ్చటా మరొకరికి ముద్దటా
    ముద్దు చేస్తూ ముద్ద పెట్టేది ఒకరటా
    మారాం చేస్తూ గారాలు పోయేది ఒకరటా
    ఊయలూపుతూ మది డోల లాడేది ఒకరికటా
    స్పర్శిస్తూ లాలిస్తూ జోల పాడుతూ
    నిద్రలో జోగేదీ మాత్రం ఇద్దరటా
    దొందూ దొందే నటా
    ఇద్దరూ దొంగలే నటా..

    ReplyDelete
    Replies
    1. జానీగారు,ముందుగా మీ చిత్రం వాడుకునే అనుమతినిచ్చినందుకు మీకు నేనే ధన్యవాదములు చెబుతున్నాను.....మీ చిత్రం చూస్తుంటే నాకు కలిగిన భావం రాశాను అంతే.

      Delete
  3. Replies
    1. గాయిత్రీగారు, మీకు నా ధన్యవాదములు .

      Delete
  4. ఆ గాజుల సవ్వడి నాకెరుక, ఆ అందెల సవ్వడి, ఆ పిలుపులో ప్రేమ, ఆ ముద్దులో భావం, ఆ గుండె స్పందనలు, ఆ చేతి స్పర్శలు, నీ చూపులో కరుణ నాకెరుకే ....
    బాగుంది
    శుభోదయం శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. మరి అమ్మ అంత గొప్పది కదా.చంద్రగారు, మీకు నా ధన్యవాదములు .

      Delete
  5. అమ్మ పంచె అనురాగం ముందు లోకమే చిన్నబోదా?
    అమ్మ చాటు బుజ్జిగాడు చేసే అల్లరి లేకపోతె అమ్మ లోకమే చిన్నబోదా ?
    అమ్మకు తన బుజ్జిగాడికి మధ్యన ఉన్న ప్రేమ వారధిని ఇలా కావ్య రూపం ఇచ్చి ఆ బందానికే సార్థకత చేకూర్చారు శ్రీదేవి గారు,
    చాల చక్కని వర్ణన, బహుశ నిజంగా తోడూ దొంగాలేనేమో, అమ్మ పొత్తిళ్ళలో నవమాసాలు ఉన్నా, అమ్మ తోనే పెనవేసుకునే ఆ బంధం ఏమిచ్చిన తీరనిది, అమ్మ ప్రేమ నిజంగా వెలకట్టలేనిది.

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్ గారు నా బ్లాగుకు స్వాగతం.మీరన్నట్లు అమ్మ వెలకట్టలేని ఒక వాస్తవం.అమ్మ గూర్చి ఎంత చెప్పినా,ఎంతమంది చెప్పినా,ఎన్ని యుగాలు చెప్పినా సశేషమే అవుతుంది.

      Delete
  6. ప్రపంచం లో అతి మంచి దొంగలు ఈ ఇద్దరే అనుకుంటా..,
    మీ అక్షరానికి పట్టుబడి,జానీచిత్రమ్లో బందించబడ్డారు.
    అద్భుతం దేవీ..

    ReplyDelete
    Replies
    1. అవును మీరజ్ బుజ్జిగాడు నిద్ర లేచాడా అని అమ్మ,అమ్మ నన్ను పట్టించుకోదేమిటా అని బుజ్జిగాడు ఒకరినొకరు దొంగ చూపులు చూసుకుంటుంటారు,ఇది ప్రతి ఒక్క తల్లికీ అనుభవమే.ఏదేమైనా మీకు ఈ దొంగలిద్దరూ నచ్చినందుకు సంతోషం.

      Delete