Tricks and Tips

Friday, January 10, 2014

రెప్పల మాటున .......


తరతరాల మాటున దాగిన
 అంతరాలను తొలగించావు . 

మనసు మాటున దాగిన 
   ఆలోచనలను కదిలించావు . 
 
రెప్పల మాటున దాగిన 
 కనుపాపలను బంధించావు .

హృదయం మాటున దాగిన 
కలలను తట్టి కరిగించావు . 

చేతల మాటున దాగిన
   చిలిపి చేష్టలకు కనిపించావు . 
 
పెదవుల మాటున  దాగిన 
        మాటలను వినకనే వెళ్ళిపోయావు .   
 
 
 
 
తలపుల మాటున దాగిన 
            మనసును విరిచి దూరమై పోయావు .      
 
కాలం మాటున దాగిన 
           స్మృతులను మననం చేసుకుంటున్నాను .   
 
 
 **********
 
 
.



8 comments:

  1. అందుకే ఈ మాటు అనేది ఉండకూడదు,
    దేవీ...., స్త్రీ హృదయం తన ప్రేమని మాటు (చాటు) చేసుకుంటుంది, తనలో పదిలంగా ఉంచుకోవాలనీ, అది తనకే చెందినదై, ఉండాలనీ, తన భావాలనన్నిటినీ నిగూడంగా ఉంచుతుంది,
    విధి వక్రించి మోసపోయినప్పుడు తనలోనే క్రుసిస్తుంది.
    మీ కవిత అలవోకగా రాసినట్లు అనిపించినా.... హృదయాన్ని కదిలించింది.

    ReplyDelete
  2. తలుపు చాటున ఉండే సాంప్రదాయం నుండీ ....మనం ఎంత బయటకు వచ్చినప్పటికీ తలపులను మాత్రం మాటునే ఉంచేస్తుండడం అలవాటైపోయింది మీరజ్ . మీ విశ్లేషనాత్మక పరిశీలనలో నేనెప్పుడూ చిక్కుతూనే ఉంటాను .

    ReplyDelete
  3. బాగుంది చాలా బాగా express చేశారు

    ReplyDelete
  4. హరిత మీ అభినందనలకు ధన్యవాదములు .

    ReplyDelete
  5. రెప్పల మాటున దాగిన ఊసులెన్నో

    ReplyDelete
    Replies
    1. వీనుల్లో చేరలేక పోయినందుకు ఆ ఊసులకు వేదనలెన్నో....

      Delete
  6. Replies
    1. Sruti welcome to my blog . Thanks for your nice compliment .

      Delete