Tricks and Tips

Friday, January 24, 2014

జోజో.....జోజో.....

నిదురించు నా బాబు నిదురించరా ....
నిదురించు నా బాబు నిదురించరా ....
జోజో.....జోజో.....జోజో.....జోజో....
జోజో.....జోజో.....జోజో.....జోజో....

అందాల చంద్రుడే అరుదెంచెరా ...
తళతళ తారలే వెల్లివిరిసెరా.....
వెండివెన్నెలే నిను చూడ వచ్చెరా ...
చల్లగాలే నిను స్పృశియించెరా...

ఏటి అలలే నీకు పాట పాడెరా ...
అమ్మ కౌగిలే నీకు ఊయలాయెరా ...
అమ్మ మనసు మాట ఆలకించరా...
మురిపాల నా బాబు నిదురించరా...

నీదు అలకలే నాకు ముచ్చటాయెరా ...
నీ ఊకిళ్ళతో పొద్దు పోయెరా....
నీ ముద్దుముచ్చట్లకు అలుపు వచ్చెరా ...
నీలాల కన్నుల్లో నిదరుంచరా ......

నిదురించు నా బాబు నిదురించరా ....
నిదురించు నా బాబు నిదురించరా ....
జోజో.....జోజో.....జోజో.....జోజో....
జోజో.....జోజో.....జోజో.....జోజో....

 ********

14 comments:

  1. Replies
    1. మీవంటి వారి అభినందనలు పొందడం ఎంతో సంతోషం ,
      ధన్యవాదములు శర్మగారు .

      Delete
  2. జోలపాట చాలా బాగుంది ఇది audio కవిత ఐతే zzz....... మరింత బాగుంటుంది :-)

    ReplyDelete
    Replies
    1. మీరు పాడతానంటే రికార్డ్ చేయడానికి నే రడీ.
      మీదే ఆలస్యం .....ఒక్క పాట మన జీవితాన్నే
      ..................దేమో హరిత.

      Delete

  3. అందాల చంద్రుడే అరుదెంచెరా .... తళతళ తారలే వెల్లివిరిసెరా .... అమ్మ మనసు మాట ఆలకించరా .... మురిపాల నా బాబు నిదురించరా...
    నిదురించు నా బాబు నిదురించరా .... నిదురించు నా బాబు నిదురించరా .... జోజో .... జోజో .... జోజో .... జోజో .... జోజో .... జోజో .... జోజో .... జోజో ....
    లాలిపాట జోలపాట చాలా చాలా బాగుంది శ్రీదేవి! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. అమ్మ జోల పాట కంటే మధురమైనది ఏముంటుంది ,
      చంద్రగారు మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete
  4. అమ్మ చేత ఇంత కమ్మని ప్రేమ ధారా జోల పలికించారు. నా బొమ్మ కి అమ్మత్వ మిచ్చారు శ్రీదేవి గారు.
    నాకిప్పుడు త్రుప్తిగాను కాసింత గర్వంగానూ ఉంది.
    మీ ఆస్థానంలో దాని స్థానం మరింత అమ్మలా అందంగా ఉంది.
    మీకు మరీ మరీ థ్యాంక్స్.

    ReplyDelete
    Replies
    1. జానీగారు ముందుగా మీచిత్రాలను ఉపయోగించుకోమన్నందుకు
      మీకు ధన్యవాదములు.అమ్మజోల నచ్చినందుకు సంతోషము.

      Delete
  5. Entha baga rasaro laali paata!! Chala bavundi :)

    ReplyDelete
    Replies
    1. శ్రీవల్లి నా బ్లాగుకు స్వాగతం .
      మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete
  6. అమ్మ కమ్మదనాన్ని బొ్మ్మలో మా తమ్ముడు చూపిస్తే...మా దేవి భావాల్తో బలాన్నిచ్చింది,
    మేము ప్రశంసతో ముంచేయకుండా ఎలా ఉండగలము?

    ReplyDelete
    Replies

    1. మీరజ్ మీ ఆత్మీయ అభినందన మాలను అందుకున్నాను,
      మరి అందమైన చిత్రానికి ప్రాణం పోస్తేనేగదా మరింత
      అందంగా ఉండేది.

      Delete
  7. అందమైన లాలిపాటతో హాయిగా నిద్రపుచ్చారు. పిక్ కూడా చాలా బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. మరి అమ్మ జోలాలి పాట కదా....పద్మగారు
      హాయిగా నిద్రపోయి లేచి, మంచి కవిత రాసారుగా...
      అభినందనలకు ధన్యవాదములు. పిక్ దాత జానీగారు.

      Delete