Tricks and Tips

Saturday, January 25, 2014

నే స్వాగతించనా ?

 రాళ్ళు , ముళ్ళు సైతం లెక్కచేయక
తన వంతు కర్తవ్యంగా,బాధ్యతగా
తన ఆకలిని , అలసటను మరచి
దేశభక్తి చాటుతున్న ఆ చిన్నారిని
చూసి నే గర్వపడనా ?
అటువంటి జాతిరత్నాలను అలక్ష్యం
చేస్తున్న ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకులను
చూసి నే సిగ్గు పడనా ?
అరవై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని
నే స్వాగతించనా ?
 
******

8 comments:

  1. సిగ్గుపడద్దు తిరగబడండి.

    ReplyDelete
    Replies
    1. ఏం తిరగబడడమో?తిరగబడుతుంటే ప్రక్కని వారు కనీసం స్పందించక,
      మననే చిత్రంగా చూస్తూ విచిత్రంగా వెను తిరిగిచూస్తూ వెళ్తూంటే ఆఖరికి
      నేనేమైనా తప్పుచేశానా అనిపిస్తోంది ....వారికోసం తిరగబడి ?

      Delete
  2. అరవై ఐదవ గణతంత్ర దినోత్సవానికి సుస్వాగత శుభాకాంక్షలు శ్రీదేవి!

    ReplyDelete
    Replies
    1. శుభాకాంక్షలు చంద్రగారు .

      Delete
  3. ఏమి చెప్పాలి , (కొన్న్నిటిని నమ్మటం మానేశాను) చిన్నారులకు ఫ్రీడం గూర్చి చెప్పటం ఎప్పుడో మానేశాను. అప్పటి త్యాగ గుణం ఇప్పుడు లేదు, ఆ యూనిటీ ఇక రాదు. ఇలాగని పిల్లలని నిరాశ పరచలేము కదా... అందుకే ఆ పిల్లాడి స్పూర్తికి ఆ ఫోటో నా గూగుల్ కవర్ పేజ్ గా పెట్టుకొని త్రుప్తి పడ్డాను. మీ ఆలోచనా విదానం ప్రశంసించ దగ్గది దేవీ...

    ReplyDelete
    Replies
    1. ఆలోచనలు ప్రశంసించదగినవే అయినా ప్రయోజనం ఏముంది మీరజ్,ఆచరణలో నాకు సాధ్యం కావడంలేదు .....ప్రయత్నించి ఓడిపోయి చెబుతున్న మాటలివి.బాధపడడం మినహాయించి నేనూ ఏమీ చేయలేకే ఇలా రాస్తూ ......

      Delete
    2. ఆచరణ అనేవి మీ ఆలోచనలే...మనం చేయగలిగినంత చేయాలి (అది మీరు చేస్తారు ) వ్యవస్థను మార్చటానికి మనం పాలకులమూ కాదూ,నియంతలమూ కాదు.కనీసం కలం తో నయినా ఆలోచనలకు దారితీద్దాం.

      Delete
    3. స్ఫూర్తిదాయకమైన మీ ప్రోత్సాహక అభినందనలకు ధన్యవాదములు మీరజ్.

      Delete