Tricks and Tips

Thursday, January 30, 2014

అక్షరమాల _/\_

  అక్షరమాల
    అక్షరమాల అదే , 
   అక్షరములు అవే ,

అక్షరములను కుదించినను , మధించినను , 
మనం నేర్చుకున్న అక్షరములు అవే ,

మన మస్తిష్కములో ముద్రింపబడిన అక్షరములూ అవే ,
మనం ఆశ్రయించిన అక్షరములూ అవే ,

పదములూ అవే ,
పదముల అర్ధములూ అవే ,

వాక్యములూ అవే ,
వాక్య పరమార్ధములూ అవియే ,

వేళ్ళ మధ్య నిలచిన కలములూ అవే ,
చేతుల్లోని శ్వేత పత్రములూ అవియే ,

శర్మ గారు ఆశ్రయించిన అక్షరములు ....
శతకోటి భ్రమలనే తొలగిస్తుంటే ,
 

రావుగారి హస్తాక్షరములు....
భాగవత తేనె సోనలైతే ,


చంద్ర గారి వర్ణమాలాక్షరాలు...
ఆ పాత మధురాలను సాక్షాత్కరింప చేస్తుంటే ,

మీరజ్ చేతిలోని అక్షరాలు...
హృద్యంగా సాగే వాస్తవాలయితే ,

పద్మార్పితను చేరిన అక్షరాలు...
పడతి ప్రేమ వేదనావస్థకు వర్ణనలైతే ,

సతీష్ గారు అక్షరాలను...
అస్త్రాలుగా సమాజ అకృత్యాలపై సంధించితే ,

ఫణీంద్రగారిని చేరుకున్న అక్షరాలు...
సహజ వ్యక్తుల ఆత్మ సౌందర్య కుసుమాలైతే  , 

వర్మగారి అక్షర మాలలు...
వ్యక్తిలో ఆలోచనలను రేకెత్తించితే ,

రమేష్ గారిని చేరిన అక్షరాలు...
రమ్యమైన ప్రకృతిలో పరవశిస్తే ,

ఆ అక్షరమాల సంతసించదా ,
అక్షరమాలను ఆశ్రయించిన వారి జన్మ ధన్యమవదా...?
 

*******





 

12 comments:

  1. మా దేవి అల్లుకున్న అక్షర సుమమాలలో.... దారమై ఉండాలనే మా తపన.
    మా వేళ్ళ మద్య ఉన్న కలానికీ, కాలానికీ న్యాయం చేస్తామని, అక్షర సాక్షిగా చెప్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయాభివందనలకు ధన్యవాదములు మీరజ్.
      ఆత్మసాక్షిగా ... కలానికీ ,కాలానికీ అక్షరసాక్షిగా
      నిలబడతాననడం నిజంగా మీ ఆత్మస్థైర్యానికి నిదర్శనం.

      Delete
  2. ఎవరబ్బా ఈ శర్మగారు? జిలేబి గారి టైపు ప్రశ్న! :)
    హతోస్మి! నేను ముందే దొరికిపోయానా? నేను కాదేమో లెద్దురూ! నేనెందుకు భూజాలు తడువుకోవడం ? :)

    ReplyDelete
    Replies
    1. అయ్యయ్యో ! మీరేనండి శర్మగారు నమ్మండి నిజంగా నిజం సుమా , మీ భుజాలు నిజమే చెబుతున్నాయి.మీ స్పందనలకు ధన్యవాదములండి శర్మగారు.

      Delete
    2. భారతం లో అక్షరతత్వం చదవండి.

      Delete
    3. తేనెసోనలలోని తేనెలు అన్నీ మన పోతన్న గారివి. హస్తాల్లో అక్షరాల్లో తేనెలు అన్నీ మా గాజుల చేతుల శ్రీదేవి స్వరూపి, శ్వేతపత్ర కలాలు లేకపోయినా స్మరించే సహృదయినివి.

      Delete
    4. మీ ఆత్మీయాభినందనలకు మనఃపూర్వక ధన్యవాదములు రావుగారు.

      Delete
  3. మీ సుగంధ అక్షర మాలలో నన్ను ఓ కుసుమంగా కూర్చినందుకు ధన్యవాదాలు. శ్రీదేవి గారు.

    ReplyDelete
    Replies
    1. అందమైన పూవులన్నింటిని ఒక్క చోట చేర్చితే ఎంత అందంగా ఉంటాయి,అటువంటి వాటిని మాల అల్లితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా ! సతీష్ గారు మీ అభినందన సుమములు పరిమళించాయి.

      Delete
  4. మాలలో ఒక తొడిమను కాగలిగిన ఎంత బాగుణ్ణునో అని ఆశ. శ్రీదేవి రాసిన ఏ జానపదం పల్లవి పదాలలో కుదురుగా కూర్చోగలిగితే ఎంత బాగుణ్ణునో అని ఆశ. అక్షరమాల అంత బాగుంది శ్రీదేవీ!
    మనోభినందనలు.

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు!మాలలు మీవి ,మేమే చిన్న చిన్న పువ్వులం....మీ అత్మీయ అభినందనలకు ధన్యవాదములు.

      Delete
  5. రాధిక ధన్యవాదములు.

    ReplyDelete