Tricks and Tips

Sunday, February 9, 2014

ఊహల్లో పులకింతలు.....


ఏల , ఏల ఈ వింతలు ?
ఏల కన్నుల్లో ఈ కాంతులు ?

కునుకుల్లో కలవరింతలు ,
ఊహల్లో పులకింతలు ,
ఊసుల్లో కవ్వింతలు ,

ఏల , ఏల ఈ వింతలు ?
ఏల కన్నుల్లో ఈ కాంతులు ?

ఏకాంతమే ఏకాంతమై ,
ఆనందమే అనంతమై ,
ఊపిరి నిండా ఊరింతలు ,

ఏల , ఏల ఈ వింతలు ?
ఏల కన్నుల్లో ఈ కాంతులు ?

చెలికాడే చేరువై ,
చిత్తంతో మాలిమై ,
మనసున నిండే గిలిగింతలే ,

ఏల , ఏల ఈ వింతలు ?
ఏల కన్నుల్లో ఈ కాంతులు ?

ఆలోచనలే సాగెలే ,
ఆలాపనలే అల్లెలే ,
చేతల నిండా అల్లరులే ,

ఏల , ఏల ఈ వింతలు ?
ఏల కన్నుల్లో ఈ కాంతులు ?


******

4 comments:

  1. ఏల ఎలేలా అని
    ఆకాశాన్నేలేలా
    ఈ లీల అలాపనాలోల
    ఆలపింపనేలా
    ఊహల ఊసుల్లో
    ఊయలూగుతున్న
    మది డోలనా సమ్మోహనా స్త్రాలు సంధించు మనోహరుడి
    వాడి బాణాల పాడి సేయక
    మిక్కిలి ఉక్కిరి బిక్కిరి యగు
    ఊహల బిగి సదలింప జాలదు
    సలలిత జాణ రో వింటే..

    ReplyDelete
    Replies
    1. కవితాతరంగాలు అలల్లా అవిశ్రాంతంగా పొంగుతూంటే .....
      ఎంచక్కా బ్లాగు ఓపెన్ చేసి , మీ అందమైన బొమ్మలకు
      ఈ కవితాలంకరణలు చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా
      జానీగారు చాలా బాగా రాశారు ,సంతోషం.

      Delete
  2. ఏల.. ఏల... అల్లరి ఊహలకు చిలిపితనం తోడైంది. బాగుందండీ...

    ReplyDelete
    Replies
    1. వాస్తవాల్లో నుంచి అప్పుడప్పుడు ఊహల్లోకి
      వెళ్ళక పోతే బాధ తగ్గదండి...అందుకే
      మధ్య మధ్య ఇలా...సతీష్ గారు మీ
      అభినందనకు ధన్యవాదములు.

      Delete