Tricks and Tips

Thursday, February 13, 2014

చిలిపి చేష్టలింక మాను ......

చిలిపి చేష్టలింక మాను చిన్ని కృష్ణయ్య
అల్లరింక కట్టిపెట్టు అలకలేలయా.......

వెన్నముంత దొంగిలించి - వెన్ననంత తోడి తిని
చల్లముంత దాచిదాచి - చల్లనంత తాగి తాగి
అదేమని అడుగుటయే పాపమేమయా
మా పాపమేమయా..........

కొమ్మ పైన ఎక్కి నక్కి - పైటలన్ని దోచి దాచి
గోపికలు అడిగినంత - చిలిపిగాను నవ్వు రువ్వి
అదేమని అడుగుటయే పాపమేమయా
మా పాపమేమయా..........

 
యసోదమ్మ చాటు నక్కి - పైట కొంగులోన దాగి
అమ్మ నిన్నుఅడిగినంత -  బుంగమూతి పెట్టి చూసి
అదేమని అడుగుటయే పాపమేమయా
మా పాపమేమయా..........

చిలిపి చేష్టలింక మాను చిన్ని కృష్ణయ్య
అల్లరింక కట్టిపెట్టు అలకలేలయా.......

*******

2 comments:

  1. చిలిపి చేష్టలింక మాను చిన్ని కృష్ణయ్య .... అల్లరింక కట్టిపెట్టు అలకలేలయా.......
    చిన్నికృష్ణుడు దొంగిలిస్తున్న గోవు వెన్న, యసోదమ్మ కొంగు చాటు దొంగ, గోప బాలికల చిలిపి కవ్వింతలు .... దృశ్యాల్లా .... అక్షరాల్లోంచి తొంగి చూస్తూ పలుకరిస్తున్నట్లుంది
    చక్కని పద పొందిక
    అభినందనలు శ్రీదేవీ! శుభసాయంత్రం!!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ అభినందనల పలకరింపులకు ధన్యవాదములు.

      Delete