Tricks and Tips

Friday, February 7, 2014

ఆ కళ్ళే .....నా ఆశల పొదరిళ్ళు ...

కళ్ళను కళ్ళు చూసాయి ,
కళ్ళలో కళ్ళు కలిసాయి ,
కళ్ళ
తో కళ్ళు నవ్వాయి ,
కళ్ళతో కళ్ళను వెదికాయి ,
కళ్ళతో కళ్ళను పిలిచాయి ,
కళ్ళను కళ్ళు ప్రశ్నించాయి .
కళ్ళతో కళ్ళు అలిగాయి ,
కళ్ళతో కళ్ళు చెలిగాయి ,

 
నాలుగు కళ్ళు రెండయ్యాయి .....

ఆ కళ్ళే  నాకిళ్ళు ,
ఆ కళ్ళే నా ఆశల పందిళ్ళు ,
ఆ కళ్ళే నా తలపుల చప్పుళ్ళు ,
ఆ కళ్ళే నా కలల పరవళ్ళు ,
ఆ కళ్ళే నా ఆలోచనల పొదరిళ్ళు ,
ఆ కళ్ళే నా భావాల లోగిళ్ళు ,
ఆ కళ్ళే నా ఆనందాల ముంగిళ్ళు ,
ఆ కళ్ళే నా హృదయపు చప్పుళ్ళు ,

ఆ కళ్ళే నిర్లక్ష్యానికి నిచ్చెన వేస్తే....

ఆ కళ్ళే నా గుండెను గుచ్చే ముళ్ళు ,
ఆ కళ్ళే నా కళ్ళలో నిండిన కన్నీళ్ళు ,
ఆ కళ్ళే నా గొంతులో వచ్చే వెక్కిళ్ళు ,
ఆ కళ్ళే నా మదిలో బాధల సుళ్ళు ,
ఆ కళ్ళే నా సంతోషానికి సంకెళ్ళు .

*******

8 comments:

  1. నీవుంటే...వేరే కనులెందుకూ....
    మొన్నరాతిరీ....
    ఓ కలవచ్చిందీ....
    ఆ కలలో మా దేవీ కనిపించిందీ...,(స్నేహం సినిమాలో పాట అది)
    బాగుంది కళ్ళ భాష ...చదివిన ప్రతిఒక్కరికీ గుండెకి వేసే సంకెళ్ళే...

    ReplyDelete
    Replies
    1. కళ్ళు పలికించే భాష ముందు ఏది నిలిచి ఉంటుంది......మీ ఫోటోలోలా ఉండి అద్దంలో చూసుకోండి...మీ కళ్ళ భావాలు మీ కాళ్ళకు సంకెళ్ళు వేసేసి మరీ నిలబెట్టేస్తాయి. మరీ కలల్లోకి కూడా వచ్చేస్తున్నానా , కొంచెం దూకుడు తగ్గించుకుంటాలే మీరజ్.

      Delete
  2. Chaalaa bagundi sridevi gaaru:-):-)

    ReplyDelete
    Replies
    1. " నా కళ్ళ భావాలను " మీ కళ్ళతో చూసి , మీ వేళ్ళతో మెచ్చుకున్నందుకు ధన్యవాదములు.

      Delete
  3. కాళ్ళ ఆకళ్ళూ కళ్ళ ఆవిళ్లు కళ్ళ ఉరవళ్ళు పరవళ్ళు కళ్ళకి కట్టినట్లు చూపారు శ్రీదేవి గారు.

    ReplyDelete
    Replies
    1. మరి ఆ కళ్ళు అలాంటివి మరి.......జానీగారు మీ స్పందనకు సంతోషం.

      Delete
  4. కళ్ళను కళ్ళు కలిసి నవ్వి. వెదికి, పిలిచి ప్రశ్నించి నాలుగు రెండయి .....
    ఆ కళ్ళే నిర్లక్ష్యానికి నిచ్చెన వేస్తే....అవి, గుండెను గుచ్చే ముళ్ళు, కన్నీళ్ళు, వెక్కిళ్ళు, సంతోషానికి సంకెళ్ళ అయి బాధల సుళ్ళు అవుతాయి
    చక్కని విశ్లేషణాత్మక భావనకు అక్షర రూపం
    బాగుంది కవిత
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ విశ్లేషణాత్మకమైన అభినందనలకు సంతోషం .

      Delete