Tricks and Tips

Monday, February 24, 2014

మా కథ ఇలా ముగిసింది....

కలిసింది , కలిసింది నన్నే నన్నే కలిసింది....
తలచింది , తలచింది నన్నే నన్నే తలచింది....
వలచింది , వలచింది నన్నే నన్నే వలచింది....
పిలిచింది , పిలిచింది నన్నే నన్నే పిలిచింది....

నవ్వింది , నవ్వింది నన్నే చూసి నవ్వింది....
మురిసింది , మురిసింది నన్నే చూసి మురిసింది....

విరిసింది , విరిసింది  నాకై నాకై  విరిసింది....
అలిగింది , అలిగింది  నాకై నాకై  అలిగింది....
ఆగింది , ఆగింది  నాకై నాకై  ఆగింది....
నిలిచింది , నిలిచింది నాకై నాకై  నిలిచింది....

జరిగింది , జరిగింది నాతో వివాహం జరిగింది....
వచ్చింది , వచ్చింది  నాతో నడిచి వచ్చింది....

అలిసింది , అలిసింది నాకై వేచి అలిసింది....
విసిగింది , విసిగింది  నాకై వేచి  విసిగింది....
నసిగింది , నసిగింది  నాకై వేచి  నసిగింది....
అరి
చింది , అరిచింది నాకై వేచి అరిచింది....

ముగిసింది , ముగిసింది మా కథ ఇలా ముగిసింది....

***********

10 comments:

  1. నేటి దాంపత్యపు తంతును బాగా చూపారు :-(

    ReplyDelete
    Replies
    1. ఆనందించినంతసేపు పట్టట్లేదు హరితా....

      Delete
  2. బాగుంది శ్రీదేవి గారు.

    ReplyDelete
    Replies
    1. హిమజగారు అభినందనకు ధన్యవాదములు.

      Delete
  3. హహహ అలా ఎలా కథ ముగుస్తుంది శ్రీదేవి గారు ఇన్ని జరిగాక నే అసలు కథ మొదలయ్యేదీ

    ReplyDelete
    Replies
    1. అంటే,మదురమైన ప్రేమ ఘట్టం ముగిసింది అని అర్ధం......
      ఆ తర్వాత గోల ఎవరు వింటారు జానీగారు .
      అభినందనకు ధన్యవాదములు.

      Delete
  4. జీవితంలో ఎంతో ముఖ్యమైన పరిణామక్రమాన్ని చక్కగా రాసావు.
    పరిపూర్ణత వైపు అడుగులు ఆరంభం తో పాటు పసితనపు అమాయకత్వం కథ ముగియడం సహజమే
    అభినందనలు శ్రీదేవీ! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. బాధ్యతలను చూసేసరికి ఒక్కసారిగా భయపడిపోయి,తాము స్వేచ్ఛను కోల్పోయినట్లుగా భావించి,ఆ సమయంలో విషయాలను వివరంగా చెప్పేవారు లేక అగమ్యగోచర పరిస్థితిలో ఈ విధంగా ......చంద్రగారు అభినందనకు ధన్యవాదములు.

      Delete
  5. దేవీ, మీరు ఇంకా బాగా రాయగలరు కదా...ఇలా అర్దాంతరంగా...,(సారీ నాకు సరిగా అర్దం కాలా)

    ReplyDelete
    Replies
    1. ఏదో పెళ్ళిలోనో ,ఫంక్షన్ లోనో కలవడం ,
      చూసుకోవడం,కళ్ళతో ఒకరినొకరు వెదకడం,
      తలచుకోవడం,ప్రేమించడం,ఎదురుచూపులు,
      నవ్వులు,అలకలు,గొడవలు....వివాహం
      ముందు ఎంతో మధురంగా అనిపిస్తాయి.
      పెళ్ళైన కొద్ది రోజుల్లోనే ఆ ఎదురుచూపులే
      విసుగు చిరాకు తెప్పిస్తాయి,అలకలు కోపాలు...
      అరుపులు అయిపోతునాయి,సున్నితమైన
      సన్నివేశాలకు తెర దించేసి జీవిత మాధుర్యాన్ని
      దూరంచేసుకునే వారిని చూసి ఇలా స్పందించా
      మీరజ్..

      Delete