Tricks and Tips

Saturday, February 1, 2014

శుభముహూర్తమే ......


  శుభముహూర్తమే చేరువ కాగా ,
మంగళవాద్యం వినబడినంతనే మదిలో
అలల అలజడి మొదలవగా ....


నిన్నటి దినమున మీరు రెండుగా ,
నేటి బంధం చేయును ఒకటిగా .

ఆద్యంతము శ్రద్ధను వీడక ,
ఆరంభానికి పునాది వేయిక .

కలలను ఇలలో చూపే వేదిక ,
ఆశల సౌధం కాదా మీదిక .

కళకళలాడే పచ్చని పందిట ,
కల్యాణఘడియలు ఎంతో వేడుక .

హద్దుల కంచెను వేసుకుని ,
మీ చిగురాకు బంధాలకు 
అచిరకాలం కావలిగా ,
జీవితవనమున మాలిలుగా ,

చల్లని సాయంసంధ్యలలో ,
పూయించాలి సుమములు కోకొల్లలు .

సుగంధ పరిమళ పవనాలు ,
మీ భావాలతో బందీలయితే ,

సంతసమన్నది మీ దోసిట ఉన్నది ,
ఆస్వాదించుటే ఆలస్యమన్నది ,

నిత్య వసంతంతో మీ జీవితవనము ,
కావాలి ఆనంద నందన వనము .

*******















10 comments:

  1. హద్దుల కంచెను వేసుకుని .... చిగురాకు బంధాలకు అచిరకాలం కావలివై, జీవితవనమున మాలివై, నిత్య వసంతంతో .... తీర్చిదిద్దుకోవాలి ఆనంద నందన వనము గా.
    చాలా బాగుంది సూచన .... చక్కని భావన
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ అభినందనాశీస్సులకు ధన్యవాదములు.

      Delete
  2. దివ్యంగా ఉంది శుభముహూర్తం

    ReplyDelete
    Replies
    1. మీ వాళ్ళు నిర్ణయించిన ముహూర్తం కదా మరీ ,చాలా బాగుంది నిజంగా . హరితా ధన్యవాదములు.

      Delete
  3. వైవాహిక జీవన వసంతంలో ”అర్ధ శతాబ్ది” పూర్తి చేసేం నిరుడే!
    ఎవరికైనా ఇదే దీవెన ”శుభమస్తు”.
    ”మనసున మనసై.......” ఎప్పుడూ ముహూర్తం మంచిదే

    ReplyDelete
    Replies
    1. అవును ఎప్పుడూ ముహూర్తం మంచిదే , మన నడవడికను మనం తీర్చిదిద్దుకోగలిగితే...శర్మగారు మీ వివాహ బంధం పచ్చగా నిండు నూరేళ్ళు సాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ....మీ అభినందనలకు ధన్యవాదములు .

      Delete
  4. నాకయితే అమ్మయే బాగుంది

    ReplyDelete
    Replies
    1. ఆ అమ్మాయిని నేనే మీరజ్,నిజానికి ఆ అబ్బాయే బాగుంటాడు...చాలా .

      Delete
    2. మీ ప్రేమ అలాగే కలకాలం ఉండాలి తల్లీ ( చెల్లీ.).

      Delete
    3. ధన్యవాదములు మీరజ్ మీ ఆశీస్సులకు.

      Delete