Tricks and Tips

Friday, February 14, 2014

దొరుకుతుందేమో అన్న ఆశతో....

అనుభవించని క్షోభ లేదు ,
అమ్మనాన్నలెవరో తెలియనందుకు...
 
ఆక్రోశించని క్షణంలేదు ,
మానసిక వేదన పంచుకోను మా కెవ్వరూ లేనందుకు ...


 బాధ పడలేదు మేమెన్నడూ ,
ఏడంతస్తుల మేడ మాకివ్వనందుకు...
 
చింతించలేదు మేమెన్నడూ ,
పంచభక్ష్యాలు మాకు అందనందుకు...

కలత చెందలేదు  మేమెన్నడూ ,
కంచి వస్త్రాలు కట్టుకోలేనందుకు...
 
ఆవేదన చెందలేదు మేమెన్నడూ ,
ఓ తరువు నీడయినా మాకు దక్కనందుకు...
 
నిరాశ చెందలేదు మేమెన్నడూ ,
అక్షరాస్యతను మాకు పంచనందుకు...

గుండె గూడు వేదనతో నిండగా ,
కన్నులు కడివెడు నీటితో నిండగా ,
చావని ఆశలు మనసులో నిండగా ,
 

కనులకు , మనసుకు పనులను చెబుతూ ...
కాళ్ళు , చేతులతో అసంకల్పితంగా...
 

వేదనతోటి వేసారిపోక వెదుకుతూనే ఉన్నాం...
నిర్జన , నిర్జీవ ప్రాంతంలో .....
 

మాకై పంపినదేమైనా దొరుకుతుందేమో అన్న ఆశతో....

****************

6 comments:

  1. చదువుతుంటే...దుండె బరువెక్కుతుంది, నిస్సహాయత నిలదీస్తుంది.
    మీ ఆలోచనలకు అభినందనలు దేవీ.

    ReplyDelete
    Replies
    1. నిస్సహాయతతోనే ఇది రాసాను,అప్పటి నుండి మనసు స్తబ్ధుగా ఉంది మీరజ్.

      Delete
  2. కనులకు , మనసుకు పనులను చెబుతూ ...
    కాళ్ళు , చేతులతో అసంకల్పితంగా...

    మాకై పంపినదేమైనా దొరుకుతుందేమో అన్న ఆశతో....

    చక్కని చిక్కని భావన శ్రిదేవి కలం నుంచి
    అభినందనలు



    ReplyDelete
    Replies
    1. అసహాయతకు రూపం ఈ నా భావాక్షరాలు చంద్రగారు.

      Delete
  3. శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ
    ప్రభవించి నడిచిన భరత భూమి
    వేదాది వాజ్ఞ్మయ విజ్ఞాన వీచికల్
    పరిమళించిన జ్ఞాన భరత భూమి
    బౌధ్ధాది మతముల వర బోధనామృత
    ఫలములు మెక్కిన భరత భూమి
    గాంధీ మహాత్ముని ఖడ్గమయి అహింస
    పరుల చెండాడిన భరత భూమి

    ఘనత బొగడంగ ఇదిగొ! ఈ కన్నులెదుట
    ‘సాక్ష్యముల్ వీధి బాలలు ఛాలు’ అదుగొ!
    వచ్చు చున్నారు నేతలీ బ్రతుకు మార్చి
    ఒనర బంగారు చేయగా ఓట్ల కొఱకు .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావుగారు_/\_ నా బ్లాగుకు
      స్వాగతమండి.ఓట్ల కొరకే,వారి బంగరు
      భవిత కొరకు ఎంత మాత్రం కాదు .
      మీ స్పందనలకు ధన్యవాదములు .

      Delete