Tricks and Tips

Wednesday, December 18, 2013

అందాల ఆ మామ .....?



సంధ్యా కెంజాయలోని సౌందర్యాలను తిలకిస్తూ
 ఆదమరచి ఆలోచనల్లో లీనమయిన 
నా మనసును తట్టి లేపిన 
ఈ తుంటరి ఎవరూ  ?

మోము చూడ మునుపెన్నడో 
చూచినట్లు తోచె ..!

నవ్వులోన మరుమల్లెలు 
కోకొల్లలుగా పూచె ...!

మనసులోన చిలిపి 
భావ వీచికలు వీచె ...!

స్పర్శ చలచల్లగా 
నను మైమరపించె ...!

కనులలోని కోటి కాంతులు 
నను పిలిచినట్లు తోచె ...!

ఎవరూ ..అతగాడు...?
ఓ ! నా మామ కదూ !

నను ఆకర్షించి , చనువుగా నా దరి చేరి 
మురిపించి , మరపించి , అలరించు వాడు 
అందాల ఆ మామ 
నా చందమామ కాక మరెవ్వడు ...?

********



4 comments:

  1. అందుకోలేని ఆ మామ ఇంకెవ్వరూ..మీ (మన) మామే:-))
    మంచి బావుకత ఉన్న కవిత బాగుంది దేవీ,

    ReplyDelete
  2. మీ చల్లని అభినందనకు ధన్యవాదములు మీరజ్ .

    ReplyDelete
  3. మల్లెలు పూచిన నవ్వులు, చిలిపిభావాల చల్లని చిరువెన్నెల స్పర్శ .... మురిపించి మరిపించి అలరించే సౌందర్యం .... ఆదమరచి ఆలోచనల్లో లీనమయిన మనసును తట్టి లేపే తుంటరి ఎవరో కాదు .... ఆ వెన్నెల రేడే!
    చాలాబాగా పొందికగా ఉంది వర్ణన
    అభినందనలు శ్రీదేవి!

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు . శుభోదయం .

      Delete