Tricks and Tips

Monday, December 9, 2013

ఎదురు చూ... స్తూ... ఉన్నాను ...


నా చిన్ని ప్రపంచంలో 
చదువుకు తప్ప స్థానం లేదని ,
తెలిసి ... అలసి , సొలసి ... విసుగే చెంది 
ఆమడ దూరం పోయారు ,
స్పందనలేని రాతిని నేనని ,
శాపాలెన్నో పెట్టారు . 

అందరిలా కాకుండా 
ఆమడ దూరంలో ఉండి ... 
నా అడుగులొ అడుగు వేసావు ,
నా అడుగుకు దూరం చెరిపావు . 
నా చూపులొ చూపు కలిపావు ,
నారెప్పల దూరం పెంచావు . 
నా నవ్వులొ నవ్వు కలిపావు ,
నా పెదవుల సున్నా చెరిపావు . 
నా మనసున భావం కదిపావు ,
నా మౌనం కూడా చెరిపావు . 

నా కనులూ , మనసూ నీ కొరకు 
వెతికేలాగా చేసావు .
 అందరిలాగా కాకుండా
 నా మనసుకు దగ్గర అయ్యావు . 

చదువు ముగిసి పోయింది ,
కలలను నిజమే చేద్దామంటే ,
నా చేయిని నీకు ఇమ్మన్నావు . 

చేయి ,చేయి ఇప్పుడే 
కలపొద్దని నేనంటే ,
    ఇప్పుడే వస్తా ఉండంటూ ... 
సుదూరంగా వెళ్ళావు .




     ఎదురు  చూ... స్తూ...  ఉన్నాను ... 
     కేవలం రెండు దశాబ్ధాలుగా ,
నన్ను విడచి వెళ్ళిన నీవు .. 
పొందినదేమిటో నాకు తెలియదు ,
పోగొట్టుకున్నదేమిటో నీకు తెలియదు ,
అయినా ఇంకా చూస్తున్నా,  
నీకై ... నిశ్సబ్ధ నిశీధిలా ....

*******

6 comments:

  1. ఆమడ దూరంలో ఉండి ...
    నా అడుగులొ అడుగు వేసావు ,
    నా అడుగుకు దూరం చెరిపావు .
    నా చూపులొ చూపు కలిపావు ,
    నారెప్పల దూరం పెంచావు .
    నా నవ్వులొ నవ్వు కలిపావు ,
    నా పెదవుల సున్నా చెరిపావు .
    excellent lines

    ReplyDelete
    Replies
    1. భావాన్ని తట్టి లేపడం గొప్ప కాదు ,వాటిని నిలబెట్టుకోవడం గొప్ప . హరితా ! ధన్యవాదములు .

      Delete
  2. "నా మనసుకు దగ్గర అయ్యావు.
    చేయి ,చేయి ఇప్పుడే కలపొద్దని నేనంటే, ఇప్పుడే వస్తా ఉండంటూ ... సుదూరంగా వెళ్ళావు .
    నన్ను విడచి వెళ్ళిన నీవు .. పొందినదేమిటో నీకైనా తెలుసా .... నీకైనా తెలుసా పోగొట్టుకున్నదేమిటో

    ఎదురు చూ... స్తూ... ఉన్నాను ... ఇంకా, నీకై ... నిశ్సబ్ధ నిశీధిలా ...."

    చాలా బాగా రాసారు "ఎదురు చూ... స్తూ... ఉన్నాను." కవిత. అభినందనలు శ్రీదేవి గారు.

    ReplyDelete
    Replies
    1. ప్రేమ పవిత్రతని తెలుసుకోమంటే ... ప్రేమనే వదిలి వెళ్ళిన వాడు తాను పొందిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువని

      తెలిసుకోలేడు ... దురదృష్టవంతుడు . ధన్యవాదములు మీ అభినందనలకు చంద్రగారు .

      Delete
  3. మనస్సు ఆడే నాటకం లో ఈ ప్రేమ ముఖ్యపాత్ర వహిస్తుంది.
    కొన్ని పాత్రలు వేదిక దిగిపోయినా, నాటకానికి తెరపడదు, చివరి వరకూ వేచి చూస్తూ ఉండే ప్రేక్షకుని కొరకైనా విధి సుఖాంతాన్ని ఆపాదిస్తుందని ఆశించాలి,(చాలా వేదాంతం చెప్పానా... మీ కవితకి అంత అవసరం మరి....:-))

    ReplyDelete
    Replies
    1. వేదాంతం కాదు , ఆశావాదం గూర్చి చెప్పారు . ఆశ కూడా ఒక స్థాయి వరకే , జీవితాన్ని కోల్పోకుండా , చేజార్చుకోకుండా మానవ జన్మకి ఒక అర్ధాన్ని ,పరమార్ధాన్ని కల్పించడం జ్ఞానవంతుల కర్తవ్యం . మీరజ్ ధన్యవాదములు .

      Delete