Tricks and Tips

Sunday, December 29, 2013

చందమామయ్యా ... నా దరికిరావయ్యా !



నిండు పున్నమి రేయిలో , నీవు చెంతను చేరగా 
వెండి వెన్నెల సాక్షిగా , వలపులన్నీ పండగా
వేల తారల కాంతులే  , వేదమంత్రం చదవగా 
వేయి కనులు కావలెలే , వేడుకంత చూడగా 

అందమైన పందిరేసి , అడుగడుగున పూలువేసి 
ఆశలన్ని ఏరి గుచ్చి , అందమైన మాలచేసి 
నీ కంఠసీమ నందుంచనా  చందమామయ్యా
చందమామయ్యా ...... చందమామయ్యా 

వెన్నెలంత పోగుచేసి  , వేగిరమే పానుపేసి
తారలన్ని దూసి దూసి , మాలలల్లి మనసు దోచి 
చల్లగాలితో కబురంపన   చందమామయ్యా 
చందమామయ్యా..... ... చందమామయ్యా 

అంతులేని రంగులన్ని రంగరించిన ఆకశాన
అందమైన నీవు నాకు అందనంత ఎత్తుకెళ్ళి 
అల్లరిటుల చేయతగునా  చందమామయ్యా 
చందమామయ్యా........ చందమామయ్యా 

చందమామయ్యా .... నా దరికిరావయ్యా
చందమామయ్యా ....  నా దరికిరావయ్యా
 నా దరికిరావయ్యా ....  నా దరికిరావయ్యా

*********

8 comments:

  1. నిండు పున్నమి రేయి .... వెండి వెన్నెల సాక్షిగా, వేల తారల కాంతులు వేదమంత్రాలు చదవగా నీవు చెంతకు చేరినట్లు
    అందమైన పందిరిలో అడుగడుగున పూలుపరిచి ఆశల అందాలను ఏరి గుచ్చి, నేను నీ కంఠసీమ నలంకరించినట్లు
    అల్లరిటుల చేయతగునా చందమామయ్యా! .... నా దరికిరావయ్యా!
    ఏ మామ అయినా మన్నించకుండా ఉండలేని, ఎంతో పవిత్రమైన ప్రేమభావనకు అక్షర రూపం .... చాలా బాగా రాసావు కవిత! అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
  2. మీ ప్రోత్సాహకర అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు.

    ReplyDelete
  3. అందీ అందని అందమే ముద్దు అన్న పాట విన్నాడేమో ఆ మామ అందుకే వెన్నెలగా అందుతూనే అందనంత దూరాన కనువిందు చేసే ఆ మామ నిజంగా చెంత చేరితే ఎంత బావుణ్నో కదా! పున్నమి రాతిరి లోకి అలా తీసుకెళ్ళిపోయారు చాలా బాగుంది

    ReplyDelete
    Replies
    1. అందనంత దూరాన ఉంటేనే ఇంత మైమరపు , పారవశ్యం కలుగుతుంటే...ఇంక దగ్గరగా ఉంటే మనం బాధ్యతల్నీ,బంధాల్నీ మరచిపోతామెమో హరితా.అందమైన అభినందనకు సంతోషం.

      Delete
    2. చందమామని పిలుస్తున్నారా.... పిలవండి, పిలవండీ... ఇంట్లో మామ కాస్తా అప్పుడు "సూర్య మామ" అయిపోతారు.

      Delete
    3. అబ్బే నా కోసం కాదండీ , నా మామ "సూర్య మామ " అయ్యాడనే చల్లబరచడానికి చందమామని పిలుస్తున్నాను అంతే . మీరజ్ మీరు మరీ మనసును చదివేస్తున్నారు అంత దూరం నుండే .

      Delete
    4. దేవీ...మీరు నాకు దూరంగా ఉన్నారా? ఎమో నాకు చాలా దగ్గరిగా అనిపిస్తారు

      Delete
    5. ఓహ్!మీరజ్ మీ అభిమానానికి ధన్యవాదములు చెప్పకుండా ఉండలేకపోతున్నాను.

      Delete