Tricks and Tips

Tuesday, December 31, 2013

నాగరికత మాటున నక్కలా.........

వాస్తవాలు తలుపు చాటుగా 
కొంగు కప్పుకొని నిలుచుంటే ,
అవాస్తవాలు వగలుపోతూ
 వాకిలి వెలుపలకొచ్చాయి .
ఆచారాలు పెరటిలో అణగిపోతూంటే ,
అనాచారాలు పెచ్చరిల్లుతూ 
వీధిలో విలయతాండవం చేస్తున్నాయి .
అత్యాచారాలు విజృంభించి ,
ఆక్రందనలు మిన్నంటించి ,
సున్నిత భావాలను మొగ్గలోనే  చిదిమేసి ,
శారీరక ,మానసిక హింసల పాల్జేసి ,
జీవించాలనే ఆశతో ప్రాకులాడినా .....
మరణశయ్యే శరణమయితే ?
ఆ ఆడపిల్లల తల్లిదండ్రుల
హృదయఘోషకు కారణమైన .........

ఆడవాసన వస్తే చాలు ,
వయసుతో పనిలేదు  ,
6 నెలల నుండీ నడుము ఒంగిన వారి వరకూ .....
వావివరుసలూ ........ తాళిబొట్టు  ...అయితే  ఏంటీ ?
విలువల్ని పాడెకెత్తి వల్లకాడు పంపించిన ..........

రోడ్డు , షాపు , సినిమాహాలు
ఇల్లు ,ఆఫీసు ,దేవాలయము
బస్సు ,రైలూ ,ఏ.టి.ఎం సెంటర్ ......
ప్రాంతమేదైనా అత్యాచారానికి అనువేనంటూ
జటలు విప్పి నడివీధుల్లో నర్తిస్తున్న కామాంధులు ...... 

 ఒక్కడిని చూడండి ...ఎలా ఉన్నాడో ........!

ట్రిమ్మ్ గా షేవ్ చేసుకుని
స్టైల్ గా క్రాఫ్ దువ్వుకుని
నీట్ గా టక్ చేసుకుని
పెర్ఫ్యూం వేసుకుని  
చెరగని చిరునవ్వు పులుముకుని
 


2014 శుభాకాంక్షలు చెప్పే సాకుతో
 నాగరికత మాటున నక్కలా ఉండి
ఏ ఇంటను అడుగు పెడతాడో ........!

ఆడపిల్లలూ  ! జాగ్రత్త
ఆత్మస్తైర్యంతో ఉండండి
తల్లిదండ్రుల్ని మించి మీ బాగు
కోరే వారు లేరని తెలుసుకోండి
మీ విలువైన జీవితాన్ని
వెలుగుతో నింపుకోండి . 
 
అత్యాచారాలకు బలైపోయిన ఆడపిల్లలందరికీ నా  నివాళులు . 

******************

6 comments:

  1. ఆడబిడ్డల మేలుకోరి హెచ్చరించిన మీ కవిత, కొత్త ఏడాదికి స్త్రీలకు కానుక అనుకోవాలి.
    సోదరీ, మీ అక్షరాలకు అంజలిఘటిస్తున్నాను

    ReplyDelete
  2. మీరజ్ మీ హృదయ పూర్వక అభినందనలకు కృతఙ్నతలు.

    ReplyDelete
  3. వావి వరుస వయసు తర తమ బేధాలు లేకుండా ప్రవర్తిస్తున్న ఈ మృగజాతి బారిన ఆడపిల్లలు పడకూడదని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ( అంత కన్నా ఏమి చేయలేకపోతున్నానన్న బాధతో)

    ReplyDelete
    Replies
    1. మన కంటి చూపుమేరలో జరిగే ఘోరాల్ని ఆపడానికి కృషి చేయాలి హరితా,మనం ఏమీ చేయలేమని అనుకోకూడదు.మనమే ఆడపిల్లల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించాలి.

      Delete

  4. "వాస్తవాలపై అవాస్తవాల చీకటి 'వెలుగు ముసుగులై', ఆచారాలు అణగారి, అనాచారాలు విలయతాండవం చేస్తూ, శారీరక, మానసిక హింసలు ప్రవృత్తులై .... జీవించాలనే ఆశను మరణశయ్య పాల్జేస్తే .... ఏ ఆడపిల్లల తల్లిదండ్రుల హృదయఘోషకైనా అంతముంటుందా!"

    మానవతా దృష్టి ప్రతి మనిషిలోనూ పెరగాలనే నీ ఆవేదన తో ఏకీభవిస్తున్నాను శ్రీదేవీ!

    "ఆడవాసన చాలు, రోడ్డు, షాపు, సినిమాహాలు, ఇల్లు, ఆఫీసు, దేవాలయము, బస్సు, రైలూ, ఏ.టి.ఎం సెంటర్ .... ఎక్కడ చూసినా నిరాటంకంగా బహిరంగ అత్యాచారాలే!"

    2013 లో దేశ రాజదాని లోనే కాదు ఏ కాపిటల్ లోనూ స్త్రీకి రక్షణ లేని దుస్థితిని చూసాము. ఆ అరాచక అమానవ అత్యాచారులను ఎయిర్ లిఫ్ట్ చేసి విష జంతువులు కౄరమృగాలు సంచరించే అడవుల్లో వొదిలేసి రావాలి. అప్పుడు కానీ వారికి అత్యాచారం వల్ల ప్రాణి ఎంత తల్లడిల్లుతుందో, ఆ క్షోభ అర్ధం కాదు.

    "నాగరికత ముసుగేసుకుని నమ్రతగా 2014 శుభాకాంక్షలంటూ ఏ నక్కైనా పరామర్శిస్తుందేమో తస్మాత్ జాగ్రత్త!" అనడం మూలం లో
    భయం ఎంతగా నీడను కూడా అనుమానించే దుస్థితిని తెచ్చిందో తెలియచేస్తున్నట్లు అనుకుంటున్నాను ....!

    "నాగరికత మాటున నక్కలా........." పోస్టింగ్ చాలా బాగుంది. ఆలోచింపజేస్తూ, .... నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. ఆడపిల్లలకు ఆత్మస్థైర్యం పెంచడంలో తల్లిదండ్రులు ఇంకా ఎంతో కృషిచేయాల్సి ఉంది ,ఈ 2014 లో ఆడపిల్లలందరూ ఏ గుంటనక్కనైనా తరిమికొట్టే విధంగా ఉండాలని ఆశిస్తూ.....మీ అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు .

      Delete