Tricks and Tips

Friday, December 6, 2013

సిగ్గుల పూబంతి ..... ఆ ఇంతి


ఆ ... ముద్దు మోముల గుమ్మ ,
మొలక నవ్వుల రెమ్మ ,
సిగ్గు తెరలను చీరగా కట్టి , 

చెంపల్లోన సొగసులు దాచి పెట్టి ,
మొగ్గ మల్లెలను సిగలోన పెట్టి ,
కనులాంతముగ  కాటుక పెట్టి ,

కాళ్ళ పారాణినే కాంచుచుండి ,
పలుకరించగా చెంతకు పోవగా ,
పాపిడి చూపిస్తూ ,పలుకదేమాయే ?
 
మునుపెన్నడూ లేని మెరుపులు కనిపించె ,
కారణమేమమ్మా ! ఓ పొరిగింటి పోచమ్మా ?

మనువు కుదిరిందమ్మా , ఆ పసిడి బొమ్మకు ,
మనువాడు వాడు నేడు రానున్నాడు ,
అందుకే అయింది .... ఆ ఇంతి ,
సిగ్గుల పూబంతి ..... !

*******
 

4 comments:

  1. ఎంత మంచి శున్నితమైన శైలి ఉందో మీ కవితల్లో,
    జానపదుల మనుగడని తలపిస్తూ..స్త్రీల మనో భావాలకు అద్దం పడుతూ.
    దేవీ... అభినందనలు.

    ReplyDelete
  2. దేవీ.. word verification తీసివేయండి, కామెంట్ పెట్టటం కష్టంగా ఉంటుంది,

    ReplyDelete
  3. Poobanti kavita chaala baagundi madam face book lo post chestunnanu ..thanks madam

    ReplyDelete