Tricks and Tips

Sunday, December 22, 2013

వేచి చూడనా నీ రాకకై ...




విహంగమై విహరించనా గగన వీధుల్లో ,
విషాదమే వీడి పాడనా గుండె గొంతుకలో ,
అనంతమైన ఆశల వల్లరినల్లుతూ ,
నీలాంబరపు చీరను చుట్టి ,
తారల తళుకుల రైకను తొడిగి ,
నుదుట సూర్యుని సింధూరం చేసి ,
కరిమబ్బును తెచ్చి కాటుక దిద్ది ,
అధరాలపై చంద్రుని దరహాస రేఖనద్ది ,
 అలల పొంగుల్ని తొణుకుతున్న గుండెల్లో దాచి ,
చల్లగాలికి మంచి గంధం ,
మరుమల్లెల పరిమళాన్నిచ్చి ,
ఘల్లు ఘల్లు మనే అందెలతో ,
గలగల గాజుల సవ్వడితో ,
మిసమిసలాడే అందంతో ,
మిలమిలలాడే కన్నులలో 
వేల కాంతులతో వేచి చూడనా నీ రాకకై ... 

********





4 comments:

  1. prakruthi loni andaalannitini pogu chesi kurchina mee sundari nereekshana falinchi ame sundarudu twaralo amenu cheraalani aakaankshisthu.............amdamaina kavithaku abinandanalu

    ReplyDelete
  2. ప్రకృతిని మించిన అందమైన వర్ణన ఇంకేముంది , మీ అభినందనలకు ధన్యవాదములు హరిత .

    ReplyDelete
  3. విహంగమై గగన వీధుల్లో .... విషాదమే గుండె గొంతుకలో .... అలల పొంగుల్ని తొణుకుతున్న గుండెల్లో దాచి, మిసమిసలాడే అందంతో ,మిలమిలలాడే కన్నులలో వేల కాంతులతో .... వేచి చూడనా నీ రాకకై ....
    బృందావనం లో రాద కృష్ణుడి కోస వేచి చూస్తున్నట్లు .... అద్భుత భావన
    అభినందనలు శ్రీదేవి!

    ReplyDelete
    Replies
    1. బృందావనం , రాధ కృష్ణులు ,వారి అనురాగం ......... తో పోల్చి నందుకు ధన్యవాదములు చంద్రగారు .

      Delete