Tricks and Tips

Sunday, January 12, 2014

ఎందుకో.......? ( 6 )


 ఆలోచనలు ఆకాశంలో,
ఆశయాలు కన్వేయర్ బెల్ట్ పై ,
మాటలూ ...సమాజానికి ఎంతచేసినా
అభివృద్ది చెందదు ఎందుకో ....?
 
*****

పదవుల కోసం పాకులాట
అక్షర జ్ఞానం లేకున్నా,
పదవి అందుకున్నాక ,
అక్షరం  నేర్చుకోవడానికి సిగ్గు ఎందుకో...? 

*******

పైపై మెరుగులకు ఆరాటాలు ,
అందం కోసం పోరాటాలు ,
మానసిక అందం లేనినాడు ,
శారీరక అందం ఎందుకో ....?

******

ఐకమత్యమే మహా బలం అంటూ ,
కుల సంఘాల అభ్యున్నతి  గూర్చి ,
ఉపన్యాసాలిస్తారు ఎందుకో ....?

********

10 comments:

  1. ఇలా ఎన్ని ప్రశ్నలు వేసుకున్నా జవాబు దొరకదు ఎందుకో???

    ReplyDelete
    Replies
    1. సమాధానాలు రావని తెలిసినా మనసు ఊరుకోదుగా పద్మగారు అందుకే ఈ ప్రశ్నలన్నీ .

      Delete
  2. సీటుకోసం కోటి తిప్పలు ,ఓటు కోసం ఎన్ని చేసినా తప్పులేదూ అనే రాజ(అవి) నీతి వినలేదా..
    అందుకే..

    ReplyDelete
    Replies
    1. విన్నా మనసు ఊరుకోదుగా మెరజ్ అందుకే ఈ ప్రశ్నలన్నీ .

      Delete
  3. మనలో ప్రశ్న ఉదయించిందీ అంటే సమాదానం సోదిస్తున్నామనే అర్దం.
    మీ ఆలోచనలెప్పుడూ అర్దమైనవే, అర్హతగలిగినవే, దేవీ.. మీ కవితల్లో చాలా లోతు ఉంటుంది, టైంపాస్ బటాణీలు కాదు.keep it up dear.

    ReplyDelete
    Replies
    1. నా వరకూ నేను , నా చుట్టూ ఉన్నవాళ్ళు ఈ ప్రశ్నల్లో చిక్కుకోకుండా ఉండేలా చూడడానికి కృషి చేస్తుంటాను , దానికి తగ్గట్టు నాకూ వారూ సహకరిస్తున్నారు . మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు మెరజ్ ,

      Delete
  4. ఎందుకో ....
    ఆలోచనలు ఆకాశంలో,
    ఆశయాలు కదలని కన్వేయర్ బెల్ట్ పై,
    .........
    పైపై మెరుగులకు ఆరాటాలు,
    అందం కోసం పోరాటాలు,
    ..........
    ఐకమత్యం సాధ్యమా అని?

    చాలా బాగుంది.
    ఆలోచనాత్మక అక్షరావిష్కరణ
    అభినందనలు శ్రీదేవీ! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీవంటివారి అభినందనలు ఎంతో స్ఫూర్తినిస్తాయి . ధన్యవాదములు .

      Delete
  5. సాధారణంగా నేను తెగ ప్రశ్నలు వేస్తుంటాను. ఎవరు చిరాకు పడుతున్నా సరే నేను ప్రశ్నిస్తూనే ఉంటా.
    కానీ.. ఈ సారి మీ ప్రశ్నలు చూశాకా... హమ్మయ్య.. అనుకున్నా. అవును మీరన్నది కరెక్టే...
    "ఎందుకో"...

    ReplyDelete
    Replies
    1. అందరి మనసులో ప్రశ్నలు ఉంటాయి సతీష్ గారు....కొందరు అడుగుతూ ఉంటారు..... వృత్తి రీత్యా మీలా, కొందరు రాస్తూ ఉంటారు....ప్రవృత్తిరీత్యా నాలా , కొందరు మనసులోనే ఉంచుకుంటారు , ఇంకొందరు నాకెందుకులే అని దులిపేసుకుంటారు ....ఎందుకో...? మీ స్పందనలకు ధన్యవాదములు .

      Delete