అందమైన ఇంటిని కట్టి ,
రుచికరమైన విందును పెట్టి ,
అతిథులందరికీ హంగులు చూపుతూ ,
భార్యా , బిడ్డలకు ఒక్కొక్కరికీ
ఒక్కొక్క గది అని ,వచ్చినవారికి చూపుతూ ...
పడుకోవడానికీ , ఆడుకోవడానికీ ,
చదువుకోవడానికీ , హాలు అని చెబుతూ ,
హంగులనన్నీ చూపావు ,
అతిధికి కూడా గది అంటూ ......
అట్టహాసంగా చూపావు , ఆనందాన్నీ పొందావు .
వివేకి ఒకడూ నోరు తెరిచి ...మరి
అమ్మకు ఇచ్చిన గది ఏదని అడగగానే ..
చుట్టూ తెలిసిన వాళ్ళు లేరు కనుక
అమ్మకు కాలక్షేపం జరగదు , పైగా
అమ్మ ఈ గచ్చుపై జారి పడిపోతుందన్నావు ..!
అయినా ఇప్పుడు అమ్మ సంగతి ఎందుకూ ..?
కాదేది వంకకు అనర్హం
రుచికరమైన విందును పెట్టి ,
అతిథులందరికీ హంగులు చూపుతూ ,
భార్యా , బిడ్డలకు ఒక్కొక్కరికీ
ఒక్కొక్క గది అని ,వచ్చినవారికి చూపుతూ ...
పడుకోవడానికీ , ఆడుకోవడానికీ ,
చదువుకోవడానికీ , హాలు అని చెబుతూ ,
హంగులనన్నీ చూపావు ,
అతిధికి కూడా గది అంటూ ......
అట్టహాసంగా చూపావు , ఆనందాన్నీ పొందావు .
వివేకి ఒకడూ నోరు తెరిచి ...మరి
అమ్మకు ఇచ్చిన గది ఏదని అడగగానే ..
చుట్టూ తెలిసిన వాళ్ళు లేరు కనుక
అమ్మకు కాలక్షేపం జరగదు , పైగా
అమ్మ ఈ గచ్చుపై జారి పడిపోతుందన్నావు ..!
అయినా ఇప్పుడు అమ్మ సంగతి ఎందుకూ ..?
కాదేది వంకకు అనర్హం
అన్నట్లు రాగాలెన్నో తీస్తుంటే ..
అవునవును , చిన్నప్పుడు నీవసలు పడకనే
చకచక లేచి నడిచావంటూ .. సాలోచనగా
వివేకి ఆ అవివేకిని చూస్తూ ఆలోచనలో పడ్డాడు ...
అవునవును , చిన్నప్పుడు నీవసలు పడకనే
చకచక లేచి నడిచావంటూ .. సాలోచనగా
వివేకి ఆ అవివేకిని చూస్తూ ఆలోచనలో పడ్డాడు ...
నిను కనిపెంచిన అమ్మ ,
నీ అవసరాల్ని తీర్చిన అమ్మ ,
నిను కంటికి రెప్పలా చూసిన అమ్మ ,
నీకై నిదురను కాచిన అమ్మ ,
నీకై చేతులు చాచి యాచించిన అమ్మ ,
నీ ఆకలి తీర్చి , పస్తులున్న అమ్మ ,
నీకై పుస్తెలు అమ్మిన అమ్మ ,
నిను గుండెగూటిలో దాచిన అమ్మ ,
ఈ రోజు నా బిడ్డ గృహప్రవేశం ...
వాడు పది కాలాల పాటు చల్లగా వుండాలని ,
చెట్టు నీడన కూర్చుని ఆకాశం కేసి ఆశగా చూస్తూ ,
తన బిడ్డకు దీవెనలిమ్మని ఆ దేవుడిని
వేడుకుంటోంది వేసారిపోక ....
ఆ గుండెగూటి కన్నా ఈ భవనం
ఏమంత గొప్పది కాదని అనుకుంటూ
వివేకి లేచి బయటకు నడిచాడు
బరువెక్కిన హృదయంతో మౌనంగా .
**********
కళ్ళు తెరిచాక కనే మొదటి రూపం కన్న తల్లి.
ReplyDeleteచేతుల్లో పొదివి పట్టుకుని కడుపులో దాచుకుని గూడునిచ్చేదీ అమ్మే.
తన కంట కంట కన్నీరు కురుస్తునా తనుకన్న వాడికి నవ్వులు పంచి ప్రేమ లో ముంచె అమ్మ.
పెరిగి పెద్దయ్యాక తనకన్నా ఎత్తులో ఉన్నా ఎత్తుకోవాలని ఆరాటపడే అమ్మ.
కన్నవాడు ఈసడించుకున్నా ఇసుమంతైనా విసుగు చెందక మౌనాన్ని ప్రేమతో ముడేసి మూలగా నక్కి ఇటువైపే ఆర్తిగా చూసే అమ్మ కోరేది వైభొగాలూ కాదు సత్కారాలూ కాదు.
కొడుకు కళ్ళల్లో చిన్న నవ్వు అమ్మా అనే అర పిలుపు.
అమ్మ మనసును గూర్చి అద్భుతంగా వివరించారు జానీగారు . మీ అభినందనలకు ధన్యవాదములు .
Deleteదేవీ, అమ్మ అన్నదే ఓ కమ్మని మాట. ఎన్ని జన్మలెత్తినా అమ్మ బిక్షే కదా,
ReplyDeleteమీ కవిత అద్భుతంగా ఉంది. అవునూ... ఆ బుజ్జి ముండని (అదేనోయ్ ఎగురుతున్న అతిధి ) నా బ్లాఅగ్ లోకి కూడా పంపవా..
మీరజ్ అమ్మ గూర్చి స్పందించని హృదయం దేవుడు లేని కోవెల వంటిది .
Deleteచక్కని కథనం అమ్మ మనసును ప్రేమను
ReplyDeleteఅందుకుగానూ ఆమె పొందే సామాజిక అలక్ష్యాలకు చక్కని అక్షరావిష్కరణ
అభినందనలు శ్రీదేవీ!
అమ్మ మనసు పై మీ స్పందనకు నమస్సులు చంద్రగారు .
Delete