Tricks and Tips

Thursday, January 2, 2014

ఆశ.........



నీ చూపులలోని కవ్వింతనవ్వాలనీ ,
నీ అధరాలపై ధరహాసరేఖనవ్వాలనీ ,
నీ భావాల్లో మాధుర్యానవ్వాలనీ ,
నీ చేతలలో చిలిపితనానవ్వాలనీ ,
నీ ఆలోచనల్లో ఆద్యంతమవ్వాలనీ ,
నీ హృదయంలో వలపుల రాణిని 
నేనే అవ్వాలని ఆశ ,
నా ఈ ఆశల తీవెలకు నీవు 
పందిరివై నన్ను అల్లుకుపోనిస్తావా ?

*********
 

8 comments:

  1. ఇంత అందమైన అక్షర మాల (పూబాల)ని ఎవరి కాద్నగలరూ..

    ReplyDelete
    Replies
    1. ఓహ్!మీరజ్ మీరు పందిరి వేసినట్లేగా ,అభినందనలకు ధన్యవాదములు.

      Delete
  2. anumathi adagavalasina avasaram ledemo intha andamaina aasa varinchadame o adrushtam

    ReplyDelete
    Replies
    1. అంతేనంటావా హరితా,అందమైన ఆశ నచ్చినందుకు సంతోషం.

      Delete
  3. నీ చూపుల కవ్వింతనూ, నీ అధర ధరహాసాన్నీ, నీ భావ మాధుర్యాన్నీ, నీ చేతల చిలిపితనాన్నీ, నీ ఆలోచనల ఆద్యంతాన్నీ, నీ హృదయ సామ్రాజ్య మహారాణిని .... అవ్వాలని ఆశ,

    మల్లితీగ కు పందిరి అవ్వడం ఎంత గొప్ప అదృష్టమో ....
    నూతన సంవత్సరం మమతల మాలల అల్లికలతో ఆరంభించడం .... చక్కని ఆశ తో .... చాలా బాగుంది.

    అభినందనలు శ్రీదేవి! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. మల్లితీగ కు పందిరి అవ్వడం ఎంత గొప్ప అదృష్టమో .... ఇంత చిన్న,సున్నితమైన విషయాన్ని అందరూ గ్రహిస్తే ....మన సమాజం ఎంత అందంగా ఉంటుందో కద చంద్రగారు...మీ అభినందనల మాలలకు సంతోషం .

      Delete
  4. నిస్వార్ధపు ప్రేమలోని అందమైన స్వార్ధాన్నీ, ఆశల తీవేలతో అల్లుకున్న అందమైన బంధనాల్నీ. చిలిపి లిపితో చిలికించిన వైనం బాగుంది.

    ReplyDelete
  5. చిలిపి లిపితో చిలకరించగా వచ్చిన వెన్నలాంటి ఆశ అందరినీ సున్నితంగా స్పృశించినందుకు చాలా సంతోషం జానీగారు.

    ReplyDelete