Tricks and Tips

Wednesday, January 15, 2014

అజ్ఞానాంధకార స్వయంకృతం


నా మనసులో మాటవై ,
నా మాటలో భావమై ,
నా భావంలో రాగమై ,
నా రాగంలో పల్లవై ,
నా పల్లవిలో ఆర్తివై ,
నా ఆర్తిలో ప్రాణమై ,
నా ప్రాణంలో చిరుదివ్వెవై ,
నా చిరుదివ్వెలో ఆశవై ,
నా ఆశలో శ్వాసవై ,
నా శ్వాసలో ఆద్యంతమై ,
నా ఆద్యంతంలో తోడువై ,
నా తోడులో నీడవై ,
నా వెన్నంటి ఉన్న నిన్ను
నాలోని వరకట్న పిశాచి మెచ్చలేదు ,
వేరొకరి చేతిలో చేయి వేసి ,
ఆచేతిలో నీ జీవితముంచి ,
నీ జీవితంలో నను తీసివేసి ,
నీ తీసివేతలో నే మిగిలిపోయి ,
మిగిలిపోయిన నా జీవితంలో ,
జీవితాంతం ఒంటరితనం ,
నాకు నేనే ఇచ్చుకున్న శాపం ,
నా అజ్ఞానాంధకార స్వయంకృతం .
 
********


13 comments:

  1. కూడికల...
    తీసివేతల...
    జీవిత భాగస్వామ్యం
    కాదనలేని సత్యం...

    పదంలో పదంగా...
    భావంలో భావంగా...
    చక్కటి కూర్పు...
    అభివందనం...
    మీ నేర్పుకి...

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనల కూడికకు ధన్యవాదములు రావుగారు .

      Delete
  2. వాళ్ళకేమి(మగవాళ్ళకు) తక్కువ తల్లీ..., మనిషి మారతానే మనస్సు మార్చుకోగలరు,
    వరకట్న చావులు పెరిగిపోతున్నా... ఆడపిల్లలను వెంటనే వాడికే ఇచ్చి కట్టబెట్టి చేతులు దులుపుకుంటున్నారు తల్లిదండ్రులు.
    మగవారిలో మంచివారు లేరని కాదు, భార్యా బిడ్డలకోసం జీవితాఅన్ని దారబోసే వారూ ఉన్నారు.

    ReplyDelete
    Replies
    1. మీరే అన్నారుగా , మగవారిలోనూ మంచివారున్నారని....అలా తన తప్పు తెలుసుకున్న ఒకని వ్యధ . మెరజ్ మీ అభినందనలకు ధన్యవాదములు . కానీ మీరు చెప్పిన జనాభా శాతమే ఎక్కువ మెరజ్ .

      Delete
  3. పదాల అల్లిక పరుగులేత్తించినా భావపు బరువు మనస్సుని కుదించింది.
    కూడికల తీసివేతల్లో జీవితపు శేషాన్నీ కళ్ళకి కట్టి కళ్ళకున్న గంతల్నీ ఆచారాలలోని గుంతల్నీ విప్పారు శ్రీదేవి గారు.

    ReplyDelete
    Replies
    1. అంత బాగా రాశానా ? మీ అభినందనలకు ధన్యవాదములు జానీగారు .

      Delete
  4. ఈ కూడికలు తీసివేతల లెక్కలలో మీ భాగస్వామ్యాని మరుస్తూ మగాళ్ళనే నోట్లో వేసుకుంటున్నారు, ఖండిస్తున్నాను అధ్యక్షా! :)

    ReplyDelete
    Replies

    1. ఏదో మా మనసుల్లో..... బాధను వేసుకుంటాం కానీ , మగాళ్ళను నోట్లో వేసుకునేంత నోరు మాకులేదు అధ్యక్షా ! అయినా మగవారంతా చెడ్డవారని అనలేదు .....మారిన మనిషిని చూపించాను ....సాక్ష్యాధారాలకై పై కామెంట్స్ పరిశీలించగలరు అధ్యక్షా !శర్మ గారు మీ అభినందనలకు ధన్యవాదములు .

      Delete
  5. శర్మ గారు , మా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఇలాగే ఉంటాం ,ఇంట్లోవాళ్ళ్కు నోట్లో వేసుకొనేందుకు ఏమీ లేకుండా చేసేస్తాం.:-))

    ReplyDelete
  6. శ్రీదేవి గారిని నేను పూర్తిగా సమర్దిస్తున్నాను, అలాగే మెరాజ్ గారిని కూడా... ఆడవాళ్ల సమస్యలను
    చాలా దగ్గర నుంచి చూశాను. మగ, ఆడ ఇద్దరిలోనూ లోపాలున్నాయి. కానీ.. నష్టం ఆడవాళ్లకే ఎక్కువ జరుగుతోంది కాబట్టి. నేను మహిళల వైపే ఉంటాను. మరోటి... వరకట్నం అనేది.. మనిషిలో
    నైతికతను సమూలంగా చంపేస్తుంది. డబ్బుల కోసం పెళ్లి చేసుకోడానికి.. మాంగల్యం కోఠీలో దొరికే వస్తువు కాదు. అది వ్యాపారం అంతకన్నా కాదు. వరకట్న పెళ్లిళ్లలో ప్రేమ కన్నా కమర్షియల్ ఈక్వేషన్సే ఎక్కువుంటాయి. ఇక్కడ నేను మరోటి చెప్పదలుచుకున్నాను. వరకట్నం ఆశించే
    మగాళ్ల కన్నా... ఆ మగాళ్ల తల్లులే ఎక్కువ. అమ్మ అత్తగా మారగానే.. ఏం తేడా వస్తుందో గానీ
    అమ్మతనం మాత్రం మాయమైపోతుంది. ఇది నేను చాలా ఇళ్లల్లో చూశాను. నేనేమైనా తప్పుగా
    మాటాడితే... నిర్ద్వంద్వంగా ఖండించే హక్కు అందిరికీ ఇస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. సతీష్ గారు నా బ్లాగుకు స్వాగతం , మీ అభిప్రాయం నూరుశాతం నిజం ...అందువల్ల నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను ...ధన్యవాదములు .

      Delete
  7. నా మది మాటవై, భావమై, రాగమై, పల్లవై,
    నా పల్లవిలో ఆర్తివై, ప్రాణమై, చిరుదివ్వెవై, ఆశవై, శ్వాసవై,
    నా శ్వాసలో ఆద్యంతమై, తోడువై, నీడవై,
    ఇన్నాళ్ళూ నా వెన్నంటి ఉన్న నిన్ను .... నా లోని వరకట్న పిశాచి మెచ్చలేదు.
    ఒక కూడిక కోసం ఒక తీసివేత శేషం గా మిగిలిన జీవితంలో .... శాపం, నా అజ్ఞానాంధకార స్వయంకృతం .

    ఎంతో సింపుల్ గా చక్కగా విడమర్చిన భావం .... మనిషి జీవితం లో డబ్బు అనే వస్తువు ప్రాముఖ్యత, మనిషికన్నా ఎక్కువై .... మనిషి శేషం కావడమే వింత!
    మంచి కవిత అభినందనలు శ్రీదేవీ!!

    ReplyDelete
    Replies
    1. జీవితంలో డబ్బు ఒక భాగం మాత్రమే , డబ్బే జీవితం అనుకుటే మనం శేషంగా మిగిలిపోవడం ఖాయం . చంద్రగారు మీ అభినందనలకు ధన్యవాదములు .

      Delete