Tricks and Tips

Saturday, January 18, 2014

బడికి పోతనే అమ్మ....

బడికి పోతనే అమ్మ నేను
బడికి పోతనే ,
సక్కగాను సదువుకుంటనే అమ్మ
నీ కన్నీల్లు తుడిసేత్తనే ,
అల్లరేమి సేయకుండా అమ్మ నేను
                         అందరిలో ముందుంటనే ,     ll బ ll

పెందలాడే లేసేత్తానే అమ్మ
వాకిలంత సిమ్మేత్తానే ,
అంటులన్ని తోమేత్తానే అమ్మ
బట్టలన్ని వుతికేత్తానే ,
గాబులన్ని నింపేత్తానే అమ్మ
                           వంట కూడ సేసేత్తానే ,      ll బ ll

సదువు లేదు , ఏమిలేదు ,
సెప్పు తీసి కొడతాను ,
నువ్వు లోనికెల్లి తొంగోవే ,
మీ అయ్యొత్తే సంపుతాడు ,
పిల్లగాన్ని ఎత్తుకెల్లి ,
                        సక్కగాను ఆడించు         ll బ ll

సదువుకున్న వారినెంతో  అమ్మ ,
సక్కగాను మెచ్చుకుంటవు ,
సదువుకుంట నేనంటే ,
సెప్పు తీసి కొడతనంటవు ,
నీకులానే నే కూడా ...
                     నాలుగిల్లు సూసుకోన      ll బ ll

వద్దు , వద్దు సిట్టీ ,
అంత మాట అనవద్దు ,
నాకులానె నీవు ,
అంత బాధ పడవద్దు ,
పలక , బలపం తీసికుని ,
బడికెల్లు సిట్టి తల్లి ....


తల్లి నీకు మొక్కుతాను ,
మా టీసెరెల్లే సదువుతాను ,
సిన్న , పెద్దలందరికి ,
సదువు ఇలువ సెబుతాను ,
మన ఊరి బాధలన్నిటినీ ,
                తరిమి , తరిమి కొడతాను    ll బ ll

 *******




4 comments:

  1. సదువుల తల్లి సరస్వతి ఆడది కాదా.
    ఆడది సదువు కుంటే ఆ ఇల్లు బడి కాదా.
    సల్లని నీ ఒడి అక్షరాల గుడి కాదా.
    నువ్వు సదివి ఇంటికే వెలుగువి కావా.
    సదువుకొవె నీ కడుపు సల్లగుండా.

    ReplyDelete
    Replies
    1. జానీగారు మీ కవితాభినందనలకు ధన్యవాదములు .
      ఆడవారి పట్ల మీకున్న గౌరవానికి అభినందనలు .

      Delete
  2. బడికి పోతనే అమ్మ నేను బడికి పోతనే, సక్కగాను సదువుకుంటనే అమ్మ ll బ ll

    పెందలాడే లేసేత్తానే అమ్మ .... వాకిలంత సిమ్మేత్తానే,
    అంటులన్ని తోమేత్తానే అమ్మ .... బట్టలన్ని వుతికేత్తానే,
    గాబులన్ని నింపేత్తానే అమ్మ .... వంట కూడ సేసేత్తానే,
    నీ కన్నీల్లు తుడిసేత్తనే, అల్లరేమి సేయకుండా అమ్మ .... నేను అందరిలో ముందుంటనే, ll బ ll

    ఎంత చక్కని ముద్దు మాటల జానపదం .... ఏ తల్లి తన బిడ్డను చదువుల సరస్వతి కావద్దనుకుంటుంది.
    చక్కని పదాల మాటల జానపదం
    అభినందనలు శ్రీదేవీ!!

    ReplyDelete
    Replies
    1. మీ మనఃపూర్వక అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు .

      Delete