వద్దు మావ వద్దు , నన్నిడిసి పెట్ట వద్దు
వద్దు మావ వద్దు , నన్నిడిసి పెట్ట వద్దు
ఏఏటి కాఏడు ఆడ పిల్లను కంటుంటే
నిన్నెలా ఏలుకోనూ , నా వల్ల కాదు పిల్ల
రంగన్నకు సూడు ఇద్దరు కొడుకులుండె
రాజయ్యకు సూడు ఇద్దరు కొడుకులుండె
రవణత్తకు సూడు ఇద్దరు కొడుకులుండె
నిన్నెలా ఏలుకోనూ , నా వల్ల కాదు పిల్ల
ఎంత మంది కొడుకులుంటే సుఖమేటి సెప్పు మావ
సెట్టుకొకడు , పుట్టకొకడు తిరుగుతుంటె సూడలేద
తాగి వాగి గొడవ సేయడం మన కళ్ళార సూడలేద
సేతి కందివచ్చినోన్ని మన కళ్ళార సూశామా
అమ్మ నాన్న బాధను ఒక్కడైన తీసాడా
వద్దు మావ వద్దు , నన్నిడిసి పెట్ట వద్దు
సూరమ్మకు సూడు ఇద్దరు కూతుళ్ళే
మారెమ్మకు సూడు ఇద్దరు కూతుళ్ళే
మల్లన్నకు సూడు ఇద్దరు కూతుళ్ళే
ఆడపిల్లలైతెనేమి సక్కంగ పెరగలేద
ఇస్కూలికి పోయి సక్కంగ సదవలేద
ఆల్లమ్మకీ నాన్నకీ మంచి పేరు తేలేదా
సెప్పు మావా సెప్పు , అట్టా సూతావేటి సెప్పు

అవును నిజము పిల్లో , నువ్వు సెప్పినాది నిజము
నా తప్పు తెలుసుకున్నా , నిన్నిడిసి పెట్టను పిల్ల
ఆడపిల్లలొద్దని ఇంకెప్పుడనను పిల్లో
మన ఆడపిల్లలిద్దరిని సక్కంగ సదివిద్దాం
నా తప్పు తెలుసుకున్నా , నిన్నిడిసి పెట్టను పిల్ల
అవును నిజము పిల్లో , నువ్వు సెప్పినాది నిజము
నా రాణి నువ్వు పిల్లో , నా రాజు నువ్వు మావా

********
వరసకట్టి పాట పాడి
ReplyDeleteఆడియో పెడితే
అయ్యోరామ! చెప్పేదా
పాట సొగసు బలేగుంది....
శర్మగారు మీ సూచనకు ధన్యవాదములు...
Deleteమీ స్పందనకు సంతోషం.
వద్దు మావ వద్దు, నన్నిడిసి పెట్ట వద్దు .... వద్దు మావ వద్దు, నన్నిడిసి పెట్ట వద్దు
ReplyDeleteనువ్వు సెప్పినాది నిజము .... అవును నిజము పిల్లో, ఆడపిల్లలిద్దరిని సక్కంగ సదివిద్దాం .... ఆడపిల్లలొద్దని ఇంకెప్పుడనను పిల్లో .... నిన్నిడిసి పెట్టెళ్ళను పిల్లో
వద్దు మావ వద్దు, నన్నిడిసి పెట్ట వద్దు .... వద్దు మావ వద్దు, నన్నిడిసి పెట్ట వద్దు
చక్కని భావన సామాజిక స్పృహ తో కూడిన పల్లెపద గీతం .... చాలా బాగుంది శ్రీదేవీ!
చంద్రగారు అభినందనకు చాలా సంతోషం.
Deleteమగపిల్లవాడి కోసం ఎదురుచూస్తూ ఆడపిల్లల్ని కనేసి ఆపై పెంచలేక బాధలు పడేవారు కొందరైతే, ఆడపిల్లల్ని చంపే వారు కొందరు, ఆ పిల్లల కన్నతల్లిని చంపేవారు మరి కొందరు. పున్నామ నరకం నుంచి ఏమి తప్పిస్తాడో గానే బ్రతికుండగానే నరకం చూపించే ప్రబుద్ధులు ఎందఱో. పున్నామ నరకం నుంచి తప్పించలేక పోయినా బ్రతికుండగానే స్వర్గం చూపే ఆడపిల్లలెందరో ఉన్నారు వారిని చూసి కూడా గుడ్డివాళ్ళు గా మిగిలి పోతున్నారు ఎందఱో. ఎందుకో? ఏమైనా మీ జానపద పోరగాడు త్వరగానే తెలివి తెచ్చుకుని రాణి మనసు గెల్చుకుని రాజు అయినందుకు అభినందనలు. చాలా బాగా వ్రాశారు.
ReplyDeleteసామాజిక విశ్లేషణతో కూడిన స్పందన బాగుంది.
Deleteహరిత ధన్యవాదములు.
చిలికి చిలికి గాలివానలా మొదలై చిలిపి సరాగాలకు మొదలై ఇరుగింటి ఎదురింటి వారితో పోల్చుకుని మంద్ర మందలింపుతో సర్దుకుని సుద్దులతో ముద్దు చేసుకునే ముచ్చటైన మురిపాన్నీ సరాగాల గారాన్నీ గానాన్నీ రంగరించి సంసారపు సారాంశాన్నీ చిలికారు శ్రీదేవి గారు ముచ్చటగా ఉంది.
ReplyDeleteమీ కవితాభినందనలకు అభివందనలు,ధన్యవాదములు జానీగారు.
Deletesimple and nice...
ReplyDeleteThank you sir.
Delete