( ఓ పల్లెలో ఒక చదువుకున్న యువకుడు ఎన్నికలలో
నిలబడి ఓట్లు అడగడానికి రాగా అదే పల్లెలోని
ఓ చదువుకున్న యువతి ఆ పల్లె వారి తరపున ...
ఊరి అభివృద్ది కోసం వేసే ప్రశ్నలు )
నిలబడి ఓట్లు అడగడానికి రాగా అదే పల్లెలోని
ఓ చదువుకున్న యువతి ఆ పల్లె వారి తరపున ...
ఊరి అభివృద్ది కోసం వేసే ప్రశ్నలు )
మొక్క నాటి ఈ కలుషితాలను కాలరాయగలవా ?
ఓ యువకుడ కాలరాయగలవా ?
మొక్క నాటగలనే ,ఓ కోమలి మొక్క నాటగలనే
మొక్క నాటి ఈ కలుషితాలను కాలరాయగలనే
ఓ కోమలి కాలరాయగలనే II మొక్క II
రోడ్లు వేయగలవా ? ఓ యువకుడ మేలు చేయగలవా ?
రోడ్లు వేసి ఈ ఊరి ప్రజలకు మేలు చేయగలవా ?
ఓ యువకుడ మేలు చేయగలవా ?
రోడ్లు వేయగలనే , ఓ కోమలి మేలు చేయగలనే
రోడ్లు వేసి ఈ ఊరి ప్రజలకు మేలు చేయగలనే
ఓ కోమలి మేలు చేయగలనే II మొక్క II
కాల్వ తవ్వగలవా ? ఓ యువకుడ నీరునివ్వగలవా ?
కాల్వ తవ్వి ఈ నారుమళ్ళకు నీరునివ్వగలవా ?
ఓ యువకుడ నీరునివ్వగలవా ?
కాల్వ తవ్వగలనే ఓ కోమలి నీరునివ్వగలనే
కాల్వ తవ్వి ఈ నారుమళ్ళకు నీరునివ్వగలనే
ఓ కోమలి నీరునివ్వగలనే II మొక్క II
చదువు చెప్పగలవా ?ఓ యువకుడ బ్రతుకు దిద్దగలవా ?
చదువు చెప్పి ఈ పిల్లలందరి బ్రతుకు దిద్దగలవా ?
ఓ యువకుడ బ్రతుకు దిద్దగలవా ?
చదువు చెప్ప గలనే ఓ కోమలి బతుకు దిద్దగలనే
చదువు చెప్పి ఈ పిల్లలందరి బ్రతుకు దిద్దగలనే
ఓ కోమలి బ్రతుకు దిద్దగలనే II మొక్క II
ప్రగతి చూపగలవా ? ఓ యువకుడ తీర్చిదిద్దగలవా ?
ప్రగతి చూపి ఈ పల్లెను తీర్చిదిద్దగలవా ?
ఓ యువకుడ తీర్చిదిద్దగలవా ?
ప్రగతి చూపగలనే ఓ కోమలి తీర్చిదిద్దగలనే
ప్రగతి చూపి ఈ పల్లెను తీర్చిదిద్దగలనే
ఓ కోమలి తీర్చిదిద్దగలనే II మొక్క II
*******************
దేవీ,చాలా బాగుంది, అద్భుతమైన సందేశం. ఇచ్హారు ఈ కవిత ద్వారా... అభినందనలు.
ReplyDeleteమీ అభినందనలకు ధన్యవాదములు మీరజ్ .
ReplyDeleteచిందులేయగలవా ఓ యువకుడ చిందులేయగలవా
ReplyDeleteపబ్బుకొచ్చి నాతోనె పోటిగా చిందులేయగలవా
చిందులేయగలనే ఓ యువతీ చిందులేయగలనే
పబ్బుకొచ్చి నీతోనె పోటిగా చిందులేయగలనే
మందు కొట్టగలవా ఓ యువకుడా మందు కొట్టగలవా
మందు కొట్టి ఆ మత్తు లోన నువ్ మునిగి తేలగలవా
మందుకొట్టగలనే ఓ యువతీ మందు కొట్టగలనే
మందు ఎక్కువై ఆ మత్తులోన నినుకూడ కొట్టగలనే
ఇదీ నేటి యువత పరిస్థితి
దుర్భిణీ వేసి మీ కవితా జంటను వెతికి వారిని చూసి ముచ్చట పడాలో లేక వద్దన్నా కంటికి కనబడే ఇలాటి జంటను చూసి బాధ పడాలో అర్ధం కావడం లేదు. ఏది ఏమైనా పాట సూపర్
తుమ్మెదల్లా మకరందాన్ని పోగుచేయక , యువత ఈగల్లా మలినాలు ఏరుకోవడంలోనే మునిగిపోతూన్నారు , ఆనందాన్ని పొందుతున్నట్లు భ్రమలలోబ్రతికేస్తూ... హితవు చెప్పినవానిని హీనంగా చూస్తున్నారు ...ఏదేమైనా మీరు నన్ను పల్లెసీమ నుండీ పబ్బుసీనుకు తీసుకెళ్ళారు హరితా సామాజిక సృహతో జానపదాన్ని విశ్లేషించినందుకు ధన్యవాదములు .
Deleteమొక్క నాటగలవా? ఓ యువకుడ మొక్క నాటి ఈ కలుషితాలను కాలరాయగలవా?
ReplyDeleteరోడ్లు వేయగలవా? ఓ యువకుడ రోడ్లు వేసి ఈ ఊరి ప్రజలకు మేలు చేయగలవా?
కాల్వ తవ్వగలవా? ఓ యువకుడ కాల్వ తవ్వి ఈ నారుమళ్ళకు నీరునివ్వగలవా?
చదువు చెప్పగలవా? ఓ యువకుడ చదువు చెప్పి ఈ పిల్లలందరి బ్రతుకు దిద్దగలవా?
ప్రగతి చూపగలవా? ఓ యువకుడ ప్రగతి చూపి ఈ పల్లెను తీర్చిదిద్దగలవా?
చిరు కొరికల చక్కని ఆశావహమైన జానపద గీతిక, చాలా బాగుంది.
ప్రగతి చూపగలనే ఓ కోమలి తీర్చిదిద్దగలనే
ప్రగతి చూపి ఈ పల్లెను తీర్చిదిద్దగలనే
ఓ కోమలి తీర్చిదిద్దగలనే || మొక్క ||
అంటూ అస్వాసన చాలా హృద్యమాంగా ఉంది.
అభినందనలు శ్రీదేవీ!!
చంద్రగారూ శుభోదయం . మీ అభినందనల సుమాలకు స్వాగతం .
Deleteబాగుంది సందేశాత్మక కవిత
ReplyDeleteరాణీగారు మీ అభినందనలకు ధన్యవాదములు .
ReplyDeleteInspiring and awaking poetry Sridevigaru
ReplyDeletePadmagaaru thanks for your compliment
ReplyDeleteమీ బ్లాగ్ లోడ్ కావడానికి సమయం తీసుకుంటున్నది. ప్లేయర్, ఫోటోల వల్లనా?
ReplyDeleteలక్ష్మీదేవిగారు నాకు టెక్నికల్ ప్రాబ్లంస్ గూర్చిన వివరములు తెలియవు , తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను సహకరించగలరు .
ReplyDelete