కదలి రండి , కదలి రండి , కదలి రండీ
ఊరివాడ ప్రజలారా తరలి రండీ
చేయి , చేయి కలిపి మీరు చేరరండీ
పల్లెసీమ సేవకూ తరలి రండీ II కదలి II
కొండలోన , కోనలోన -ఎక్కడున్న మనం , మనం
ఒక్క కేక తోడిదే - ఒక్క చోట చేరుదాం
కంటి చూపు మేర చూడు - కలుషితం , కలుషితం
మొక్కలెన్నో నాటేసి -పారద్రోలు ప్రతి క్షణం II కదలి II
జనం , జనం , జనం , జనం - కొదవలేని జనం , జనం
ఒక్క బిడ్డ చాలులే - చింతలే పోవులే
మాయదారి జబ్బులొచ్చె - మందులేమో లేవు ,లేవు
భాగస్వామి ఒక్కరైతే - బాధలే రావులే II కదలి II
పెద్దవారు , చిన్నవారు - బేధమే లేదు , లేదు
ఉడత భక్తి సాయమే - ఊరి నుద్దరించులే
వెతలు వేయి ఉన్ననూ - వెరపు నీకు వద్దు , వద్దు
తీర్చగలం తప్పక - గెలుపు మనదే నమ్మరా II కదలి II
కొండలోన , కోనలోన -ఎక్కడున్న మనం , మనం
ఒక్క కేక తోడిదే - ఒక్క చోట చేరుదాం
కంటి చూపు మేర చూడు - కలుషితం , కలుషితం
మొక్కలెన్నో నాటేసి -పారద్రోలు ప్రతి క్షణం II కదలి II
జనం , జనం , జనం , జనం - కొదవలేని జనం , జనం
ఒక్క బిడ్డ చాలులే - చింతలే పోవులే
మాయదారి జబ్బులొచ్చె - మందులేమో లేవు ,లేవు
భాగస్వామి ఒక్కరైతే - బాధలే రావులే II కదలి II
పెద్దవారు , చిన్నవారు - బేధమే లేదు , లేదు
ఉడత భక్తి సాయమే - ఊరి నుద్దరించులే
వెతలు వేయి ఉన్ననూ - వెరపు నీకు వద్దు , వద్దు
తీర్చగలం తప్పక - గెలుపు మనదే నమ్మరా II కదలి II
***********
"కదలి రండి, కదలి, కదలి రండీ కదిలి కదిలి కదిలి .... ఊరివాడ ప్రజలారా తరలి రండీ!
ReplyDeleteచేయి, చేయి కలిపి పల్లెసీమ సేవకూ II కదలి II
కొండలోన, కోనలోన ఒక్క కేక తోడిదే - ఒక్క చోట చేరుదాం! మొక్కలెన్నో నాటేసి II కదలి II
పెద్దవారు, చిన్నవారు - బేధమే లేదు, ఉడత భక్తి సాయమే - ఊరి నుద్దరించులే! వెతలు వేయి ఉన్ననూ - వెరపు నీకు వద్దు II కదలి II"
సామాన్యుడ్ని చైతన్యవంతుడ్ని చేసేందుకు కవయిత్రి కలం ఉద్యమిస్తున్న భావనావేశం ....
అభినందనలు శ్రీదేవీ!
చంద్రగారు మీ అభినందనలే మావంటి వారికి ప్రోత్సాహకాలు .
Deleteగొప్ప ఆశాభావం.ఆశయం కనిపిస్తుంది.
ReplyDeleteఅది నిజాన్ని చేయటానికి మా చేతు(చేత)లనూ కలుపుకొని నడవండి దేవీ.
నా భావాలు రాయడానికే మీ స్పందనల సిరాను ఆశ్రయిస్తుంటే , ఆశయాలకు మీ హస్తాల్ని అందుకోకుండా ఎలా ఉంటాను మీరజ్ . తప్పకుండా ......
Deleteసమస్యలనే కాక వాటి పరిష్కారాలను కూడా తెలియజేస్తూ చాలా మంచి పదం వ్రాశారు చాలా....... బాగుంది. మీ అక్షర రూపం కార్యరూపం దాల్చాలని మీ చైతన్య స్ఫూర్తి తో నేను కూడా భాస్వామిని కావాలని, మీ పల్లెపదం కదం తొక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ReplyDeleteఎక్కడా ? హనుమంతుల గూడెంలోనేనా ? పదండి నాతో అడుగు కలపడానికి.....హరితా .
ReplyDelete