Tricks and Tips

Saturday, January 18, 2014

ముదితల్ నేర్వగ రాని .......


  భార్యా భర్తలంటే ఒకరు ఎక్కువ కాదు ,ఒకరు తక్కువ కాదు . ఇద్దరూ సరి సమానం ,చెరిసగం .ఒక విషయం తప్పుగా అర్ధం చేసుకుని తగవులాడుకుని ,నేను కరక్టంటే నేను కరెక్టనుకోవడం పూర్తిగా పొరపాటు . కారణం ఇద్దరిలోనూ తప్పు చెరిసగం ఉండడమే .అలాగే ఒక
విషయం మంచిగా , అర్ధవంతంగా లేదా లాభసాటిగా జరిగినా , దానికి నేను కారణమంటే నేను కారణమని అనుకోవడం కూడా
పొరపాటే .కారణం మంచి లోనూ ఇద్దరూ చెరి సగం బాధ్యత కలిగి ఉండడమే .కష్టానికీ , సుఖానికీ ఒకరికొకరు తోడుగా ఉంటూ,
 కష్టాలకు కృంగిపోక,సుఖాలకు పొంగిపోక ఒడిదుడుకులను ఒడుపుగా దాటుకుంటూ అనుక్షణం ఒకరికొకరుగా జీవిస్తూ
ఆనందతీరం వైపు పయనించడమేజీవితం .జీవితమంటే జీతం కాదు .జీతం జీవితంలో ఒక భాగం మాత్రమే.ఒకరి జీతం ఎక్కువ
కాదు,మరొకరి జీతం తక్కువ కాదు. అదెలా అని ఆశ్చర్యమా?జీవితమే సగం , సగం అయినప్పుడు జీతం విషయం అణువంత .
కాదంటారా ?ఉద్యోగం శాశ్వతమా , అశాశ్వతమా అన్నది కాదు ముఖ్యం. అది చేస్తున్నమనలో ఎంత వరకూ స్థిరత్వం ,
ఖచ్చితత్వం,పనిపట్ల గౌరవభావం బాధ్యత ఉందనేదే ముఖ్యం.భార్యా భర్తలు సంపాదించేదాన్ని బట్టి కాదు గుర్తింపు పొందవలసినది ,
ఒకరి వ్యక్తిత్వాన్నిమరొకరు గుర్తించిన గుర్తింపే శాశ్వతమైనది.ఆలుమగలు ఒకరినొకరు గుర్తింప చేసుకునే ఖ్యాతి వారిలోని
అనురాగానికే వర్తిస్తుంది .భార్యా భర్తల మధ్య మనము , మనది అనే భావనే మమతానురాగాల్నిపెంచుతుంది.  జీవితాన్ని
లక్ష్య సాధన వైపుకు మళ్ళిస్తుంది . నూతన ఆశలనెన్నింటినో చిగురింపచేస్తుంది . ఆశావహ
దృక్పథాన్ని పెంచుతుంది .
బంధాలను పటిష్ట పరుస్తుంది .ఈ జీవితం మనది , మన చేతిలోనే ఉంది , దాన్ని అందంగా తీర్చి దిద్దుకునే కళను నేర్చుకోవాలి .
( ముదితల్ నేర్వగ రాని విద్య కలదే ముద్దార నేర్పింపగాన్ )    

***********************


10 comments:

  1. చెప్పడం తేలికే :)

    ReplyDelete
    Replies
    1. 'మనము ' అనే నమ్మకం ఏర్పరచుకోవడమనేది మన చేతిలోనే ఉంది . అహాన్ని అదుపు చేసుకుంటే కష్టం ఉండదనేది నా అభిప్రాయం . శర్మగారు మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను , ధన్యవాదములు మీ స్పందనలకు .

      Delete
  2. మంచి వివరణాత్మక మైన సందేశాన్నిచ్చారు.
    నిజమే మీరన్నది, (కానీ మన ముదితలు నేర్పని విద్యలు కూడా చాలా నేర్చుకుంటున్నారు)
    ఈర్ష్యా అసూయలతో.. ముదితలు చేసే పనులుచూస్తుంటే వళ్ళు గగుర్పొడిచే సందర్బాలు ఎన్నో...(సందర్బం వచ్హినప్పుడు చెప్తాను)
    మీ వివేకవంతమైన టపాలు ఎప్పుడూ జనాలకు ఉపయోగ్యమే, అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మెరజ్ మీ అభినందనలకు ధన్యవాదములు . మీరన్నట్లు సున్నిత మనసుతో మెలగవలసిన ముదితలు కరడుగట్టిన సందర్భాలు చాలా చూస్తున్నాము , దురదృష్టకరం .

      Delete
  3. కష్టాలకు కృంగిపోక, సుఖాలకు పొంగిపోక ఒడిదుడుకులను ఒడుపుగా దాటుకుంటూ అనుక్షణం ఒకరికొకరుగా జీవిస్తూ ఆనందతీరం వైపు పయనించడమే జీవితం .
    భార్యా భర్తల మధ్య మనము, మనది అనే భావనే మమతానురాగాల్నిపెంచుతుంది. జీవితాన్ని లక్ష్య సాధన వైపుకు మళ్ళిస్తుంది. నూతన ఆశలనెన్నింటినో చిగురింపచేస్తూ. ఆశావహ దృక్పథాన్ని పెంచుతుంది.
    చక్కని మాటలు సరళమైన పదాలతో సామాజిక ఆవశ్యకతను వివరించడం జరిగింది ఈ కవిత లో. కథనం చాలా బాగుంది.
    అభినందనలు శ్రీదేవి!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ ప్రోత్సాహక అభినందనలకు ధన్యవాదములు.

      Delete
  4. మీ భావనతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను శ్రీదేవీ గారు. భార్యభర్తల్లో హెచ్చు తగ్గులు అనేవి పెద్ద నాన్సెన్స్. జీవితాలను జీతంతో కొలిస్తే మామిడాకులు కాస్తా విడాకులుగా మారుతాయి. అంతంత మాత్రంగా చదువుకున్న గృహిణిలు చక్కగా ఇల్లు సర్తుకుంటుంటే. బాగా చదువుకున్న భార్యలు చాలా మంది నిరక్షరాస్యుల కన్న హీనంగా ప్రవర్తిస్తున్నారు. అహంకార పూరిత భర్తల సంగతి సరేసరి. సమస్య ఎక్కడి నుంచి మొదలైనా.. జీవితాంతం కలిసుండాల్సింది మేమిద్దరం అనే భావన మొగుడు పెళ్లాల మధ్య ఉంటే.. ఏ సమస్యా ఉండదు. ఆ ఇంగితం ఇద్దరిలో ఉండాలి. ఏమంటారు...

    ReplyDelete
    Replies
    1. ఆ ఇంగితం ఇద్దరిలో ఉండాలి. ఏమంటారు...నేనన్నది కూడా ఇదే సతీష్ గారు , వారిద్దరి ఏకాభిప్రాయంతోనే ఏదైనా సాధ్యం . మీ స్పందనలకు ధన్యవాదములు .

      Delete
  5. జీవితమే సగం , సగం అయినప్పుడు జీతం విషయం అణువంత ...

    సగ భావం పెనవేస్తే జీవితాన ఆనందం మరి కాదా కొండంత...
    తెలుసుకున్న జంటలకు ఇక ఆపై బ్రతుకంతా పండంట...

    బాగుంది శ్రీదేవి గారు.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనలకు ధన్యవాదములు రావుగారు.

      Delete