Tricks and Tips

Thursday, January 23, 2014

మధురాలాపనతో....


 మధుమాసపు మధురోహలు
తీవెలై తనూలతనల్లి  ,
మనసంత పాకే  
 మరుమల్లెలే పూచే ,

నిలువనీయదే మనసు
నను నిముషమైనా ,
మరువనీయదే మది
నిను నిదురనైనా ,

అలలాంటి కలలే
అరుదెంచి అలరించెనే ,
శిలలాంటి బ్రతుకును
కదిలించి కరిగించెనే ,

పలవరింతలే నిను  
పరవశించి పలుకరించగా ,
కలవరించి నే నిను 
వలచి తలచుకోనా ,

మదిలోన ఆశలు 
మిన్నంటి మెరిసే ,
నా హృదిలోని భావం 
నీ కొరకు విరిసి ,

మధురాలాపనతో ,
మధుర రాగాలాపనతో ,
మధుర భావలాహిరితో ,
మధుర క్షణాలకై వేచి చూస్తున్నా .

 ********

12 comments:

  1. మీ మధురాలాపన మనసు దోచే విధంగా అందంగా సాగింది కవిత, చిత్రం రెండూ ఆకర్షణీయమే

    ReplyDelete
    Replies
    1. హరితా! మీ మధురాభినందనలకు ధన్యవాదములు.

      Delete
  2. అలలాంటి కలల పలవరింతల పరవశాల మిన్నటిన మది ఆశల మధురూహల మధుర భావలాహిరితో .... మధుర క్షణాలకై వేచి చూస్తూ మధుర రాగాన్నాలాపించుతున్నట్లు .... ఎంతో బాగుంది కవిత
    అభినందనలు శ్రీదేవి!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు ! మీ స్పందనల పరంపరలకు ధన్యవాదములు.

      Delete
  3. చిన్న సవరణ... మధురూహలు కాదు... మధురోహలు.

    ReplyDelete
    Replies
    1. ఫణిగారు మీ సూచనకు ధన్యవాదములు . సవరించాను .

      Delete
  4. మీరేమో అంతా మధురం అంటున్నారు నాకు సుగర్ ఉంది :)

    ReplyDelete
    Replies
    1. శర్మగారు నమస్కారములు .మన ఊహలకు , భావాలకు , ఆలోచనలకు షుగరుతో పని లేదుకదా , పాపం వాటినైనా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుదాం ,కాబట్టి మీరు రచనల్లోని మాధుర్యాన్నంతటినీ నిస్సందేహంగా ఆస్వాదించి మీ బ్లాగు మిత్రులనందరిని ఆనందింప చేయండి . ధన్యవాదములు .

      Delete
  5. మదుమాస వేళలో...మనసైన తోటలో విహరించే చెలీ...
    అక్షర మాలల గుభాళింపులు మాదాకా వస్తున్నాయి.

    ReplyDelete
    Replies
    1. చాలా సంతోషం మీరజ్ . నా గుభాళింపుల పూమాలలు , పూలతోనేనా మీరు అలంకరిస్తున్నారు.....

      Delete
  6. ఆహా.. ఏం చెప్పారండీ... మాంచి తలనొప్పి సమయంలో చదివాను.. దెబ్బకి ఎగిరిపోయింది.
    హాయిహాయి మాటలు... అమృతాంజనంలా పనిచేశాయి. థాంక్యూ...

    ReplyDelete
    Replies
    1. సంతోషం సతీష్ గారు , నా కవిత అంతా బాగా పనిచేసినందుకు...ఎటొచ్చి అమృతాంజనం , జండుబాం కంపెని వారి పరిస్థితి గురించి......??????

      Delete