మౌనంగా ఉంటూనే మాట్లాడాలని ఆశ
మనసులోని భావాలన్నీ వివరించాలని ఆశ
విలువలతో కూడిన జీవితాన్ని చూపించాలని ఆశ
మనసులోని వ్యధలన్నీ మాయంచేయాలని ఆశ
మనసున్న మనిషిగా బ్రతకాలని ఆశ
మనిషిగా ఈ బ్రతుకును బ్రతికించాలని ఆశ
చీకటిలో చిరుదివ్వెను నేనవ్వాలని ఆశ
మౌనంగా ఉంటూనే మాట్లాడాలని ఆశ
********
మనిషికి మనసును పరిచయం చేసేది మౌనం
ReplyDeleteమనసుకు ఏకాంతాన్ని పరిచయం చేసేది మౌనం
ఏకాంతానికి ఆలోచనను పరిచయం చేసేది మౌనం
ఆలోచనకు మంచిని పరిచయం చేసేది మౌనం
మంచిని కార్యరూపం దాల్చమంటూ నిష్క్రమించేది మౌనం
మౌనం మౌనం తో మౌనంగా మాట్లాడే మాటను చూపేది కళ్ళే చూసేదీ కళ్ళే వినేది మనసు
కవిత చిత్రం రెండూ చాలా బాగున్నాయి
మౌనంగా కనిపించే మీలో మౌనంగా ఇంత కవితాభావం దాగుందని,
Deleteమౌనంగా మిమ్మల్ని చూసేవారికి మీ మౌనం వెనుక మాటల జడి వానుందని,
మౌనంగా ఎదుటివారిని చూసే మీ మౌనానికి ,ఎదుటివారు మౌనంగా చూడడం
తప్ప, మీ మౌనానికి భంగం కలిగించే ఆలోచనకు మౌనంగానే స్వస్తి పలికేసి,
మౌనంగా ఉంటూ...మీ మౌనం వెనుకున్న అర్ధాలను అర్ధం చేసుకోలేక, మౌనంగా
ఉండడమే ఉత్తమమనుకుని, మౌనంగా మునిలా ఉండిపోతారు మౌనముద్రలో .
nice.. :)
ReplyDeleteThank you Kavyasree.
Deleteఅన్ని ఆశలూ నెరవేరేవే.....మీరు చాలా అల్పసంతోషండి :-)
ReplyDeleteమానవుడు అల్పుడేనండి నాదృష్టిలో , అందుకే అల్పమైన సంతోషాలు ..ఈ అల్ప సంతోషికి.మీ అభినందనలకు ధన్యవాదములు పద్మగారు .
Deleteమనసున్న మనిషిగా బ్రతకాలని .... చీకటిలో చిరుదివ్వె వెలుగును నేనవ్వాలని .... మౌనినై మాట్లాడాలని .... ఆశ
ReplyDeleteఒక అందమైన ఆశ
చైతన్య వింజామరలు వీస్తున్న దిశగా
అభినందనలు శ్రీదేవీ!
మీ చైతన్యవంతమైన అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు .
Deleteమీ భావనల్లో చైతన్యం బాగుంది. ఎన్నో చెప్పాలని చెప్పలేక, జీవితాన్ని తనకు నచ్చినట్టు
ReplyDeleteతీర్చిదిద్దుకోవాలని ఆశపడి... ముందుకు సాగలేక, పుట్టినందుకు కనీసం మనిషిగా విలువలతో
బతకాలన్న ఆశలు.. ఇలా ఎంతో మంది మహిళల వేదనను ఇందులో క్లుప్తంగా గాఢంగా వర్ణించారు.
శ్రీదేవి గారు... ఈ ఆశలన్నీ నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఇలాంటి ఆశలు మౌనంగా కేవలం స్త్రీలకే ఉంటాయి , అలానే వేదన కూడా స్త్రీ మౌనంగానే భరిస్తుంది సతీష్ గారు...మీరు ఆశించినట్లు అవి నెరవేరితే అంతకన్నా సంతోషమేముంది ...ధన్యవాదములు.
Deletemounam gaa mee kavitani mechchukuntunnanu
ReplyDeleteమౌనంగా నయినా మెచ్చుకున్నందుకు సంతోషం రాధిక,మౌనంగానే నా ధన్యవాదములు స్వీకరించండి.
Deleteబాగుంది...
ReplyDeleteమీ ఆశల అలలు
కొన్నైనా తీరం చేరాలని...
నా ఆశ...
రావుగారు !మీ ఆశావాహమైన అభినందనకు ధన్యవాదములు.
Delete