Tricks and Tips

Monday, January 13, 2014

కళామ తల్లిని ఓదారుస్తూ .......


 కళాకారులం మేమంతా ,
కళలకు కాణాచి మా ఇల్లంతా,
కళా సంపన్నత మా ఇంట ,
కళా వైభవం మా వెంట ,
కాలం కలసి రాదు మాకు ,
కళా తృష్ణ లేదు మీకు .
నాలుగు మెతుకులు దొరకవు ఎపుడూ ,
డొక్కల నిండా తిన్నది ఎపుడో ,
అయినా గాత్రం , నాట్యం ఆగదు ఎపుడూ .
రాబోయే కాలంలో పోబోయే
మంత్రి ఒకడు రాబోతున్నాడని  ,
మమ్ము రమ్మని పిలిచారు .
ఆశావాదం చావక మాకు ..
ఎండిన , వెలసిన ముఖాలకు ,
రంగురంగులు పులుముకుని ,
ఆకలి మంటలు దాచుకుని ,
రాని నవ్వులను పిలుచుకుని ,
ఆడిన ఆట ఆడక , 
పాడిన పాట పాడక ,
అలుపు సొలుపూ లేకుండా ,
ఎగిరి ఎగిరి ఆడుతూ ,
గళం అరిగే వరకూ పాడుతూ ,
లయవిన్యాసాలు చేస్తుంటే  ,
ఆపండాపండంటూ వచ్చి ,
అర్ధాంతరంగా ఆపేసి ,
కళలను హేళన చేసారు ,
కళాకారులను అవమానించారు .
పైసలు ఇమ్మని అడిగితే ,
అంతా అయ్యే వరకూ ఆగమని ,
నాలుగు రూకలు చేతిలో పెట్టి ,
అదేమంటే , అదే ఎక్కువ అన్నారు . 
ఆకలి జ్వాలలు అటుంచి ,
హృదయ జ్వాలలు మిన్నంటీ ,
అస్తమించే సూర్యుని చూస్తూ ,
కళలను అస్తమించనీయమని ,
కళామ తల్లిని ఓదారుస్తూ ,
ప్రకృతి మాతకు కళలను ,
సంతోషంగా అంకితమిచ్చాం .
( కళలను గౌరవించడం మన కర్తవ్యం )

********

8 comments:

  1. కళను ఆకలికి అడ్డ్డుపెట్టుకుంటున్నారు అనే చిన్నచూపు మన సమాజం లో పాతుకుపోయింది.
    కళలు అంటే ఏ.సీ రూముల్లో పుట్టాయి అనే దురాలోచన బలిసి ఉంది.
    ఇలాగే ఎన్నో కళలు అంతరించి పోతున్నాయి , మీ కలం తో మరోమారు ఊపిరిపోశారు.

    ReplyDelete
    Replies
    1. కళలను కళాత్మకంగా ఆస్వాదించే వారు తక్కువయ్యి , ఎవరైనా ముఖ్య అథిదులు వచ్చే లోపు కాలక్షేపంగా పెట్టడం నిజంగా దురదృష్టకరం .మెరజ్ మీ అభినందనలకు ధన్యవాదములు .

      Delete
  2. చాలా బాగా వ్రాశారు కళాకారులకు ఇటువంటి సందర్భాలు ఎంత బాధాకరమో చక్కగా తెలియాజేశారు ధన్యవాదములు

    ReplyDelete
    Replies
    1. నే చూసినదే రాశాను హరిత . నాలో కలిగిన బాధల భావ పరంపరే ఈ కవిత . అభినందనలకు ధన్యవాదములు .

      Delete
  3. కళలను గౌరవించడం మన కర్తవ్యం
    కళలను గౌరవించడం లో కళాత్మకత ఉంది
    బాగుంది శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ కళాత్మక అభినందనలకు ధన్యవాదములు .

      Delete
  4. మా ఆవిడ ఒక పెద్ద సంగీతం కుటుంబం నుంచి వచ్చిన కర్ణాటక వాగ్గేయకారిణి. వాళ్లది చాలా పెద్ద కుటుంబం. అందరూ గాత్రమో, ఏదో ఒక ఇనుస్ట్రుమెంట్ అద్భుతమైన ప్రవేశం ఉన్నవారు. కాని వారంతా వేరేవేరే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రతీ త్యాగరాయ ఉత్సవాలకు అందరూ కలిసి పంచరత్నాలు
    ఆలపిస్తుంటారు. విచిత్రమేంటంటే... ఆ వేదికపై పాడే వారు.. కింద మా కుటుంబం మరో నాలుగైదు
    కుటుంబాలు మాత్రమే ఉంటాయి. అర్థం కాని, రణగొణధ్వనులకు గుడ్డలు చించుకుని గంతులు వేసే
    మన యువతకి సంప్రదాయమే తెలీదు. ఇంట్లో నేర్పితే వస్తుంది. ముందు ఇంట్లో కన్నవాళ్లకు
    సంప్రదాయాలు ఎంత తెలుసన్నది పెద్ద ప్రశ్న. అయినా పట్టువదలని విక్రమార్కిణిలా మా ఆవిడ తరపు బంధువులు ఏదో విధంగా సంగీత సేవ చేస్తున్నా.. ఆదరణ లేదు. పాపం తన ఆవేదన
    చూసినపుడల్లా బాధ అనిపిస్తుంది. కళ తప్పి కళకు ప్రాణం పోసేందుకు మేమంతా ఎంత కృషి
    చేస్తున్నా... ఫలితం లేకుండా పోతోంది శ్రీదేవి గారు. బట్ ఏదో ఒక రోజు. ఈ కళలే దిక్కవుతాయన్న
    నమ్మకం నాలో ఉంది. మీ పోస్ట్ చూసి.. ఈ ఉపోద్ఘాతం రాయాలనిపించింది సుదీర్ఘంగా.

    ReplyDelete
    Replies
    1. ముందుగా మీ భార్య , అమె కుటుంబ సభ్యులకు కళాభివందనములు . నిరాశతో కళలను నీరు కార్చ వద్దు .మీ స్పందనలకు ధన్యవాదములు సతీష్ గారు .

      Delete