Tricks and Tips

Saturday, January 11, 2014

సంక్రాంతి శుభాకాంక్షలు...._/\_

మనసు అనే తెల్లని కాగితం పై ,
ఆలోచనలనే అక్షరాలుగా పేర్చి ,
భావాలను పదాలుగా మార్చితే ,

అక్షరాలతో అలంకరించుకుని ,
పదాలను ఏరి కూర్చుకుని ,
వాక్యాలకు ప్రాణం పోసుకుని ,
బ్లాగు ఇంటిలో పుట్టి ...
కళకళలాడుతూ , కళాకోవిదురాలిగా 
మీ ముందు ఉన్న ఈ పాప పేరు కవిత .

పేరుకు తగ్గట్టే మీ కనులకు విందుగా ,
 వీనులకు విందుగా , మనసుకు విందుగా
 అనేకానేక సందేశాలను మోసుకుని వచ్చింది .
అందులో భాగంగానే ఈరోజు మీ అందరికీ తెచ్చిన
శుభా కాంక్షలను అందుకోండి బ్లాగు మిత్రులారా..

 
సంక్రాంతి శుభాకాంక్షలు .
 
********

4 comments:

  1. దేవీ... అరెశెల లాంటివేమీ లేవా.. , ఇలాగయితే సంక్రాంతి చప్పగా ఉండదా...?
    అర్దం చేసుకోవూ...:-))
    పోనీలే ఎంతైనా పెద్దదాన్ని కదా దీవించేస్తా...
    ఆయురారోగ్యాలతో,నిత్య సుమంగళివై,పిల్లాపాపలతో,విద్యా,వివేకాలతో, చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలి.

    ReplyDelete
    Replies
    1. మెరజ్ మీ దీవెనలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను .

      Delete
  2. మనసు అనే తెల్లని కాగితం ముంగిట్లో,
    ఆలోచనలనే అక్షరాలు ఆశల ముగ్గులుగా అల్లి,
    భావాలను పదాలుగా సంక్రాంతి లక్ష్మి ని స్వాగతిస్తే ....
    చక్కని భావన శ్రీదేవీ! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ అభినందనలకు చాలా సంతోషంగా ఉంది , ధన్యవాదములు .

      Delete