Tricks and Tips

Wednesday, January 29, 2014

భామనే.........!


 భామనే...సత్యభామనే ,
భామనే...సత్యభామనే ,

సుందరవదనం నాదేనే ,
సుందరి అంటే నేనేనే ,

 
పంతం అంటే నాదేనే ,
 పౌరుషమంటే నేనేనే ,

చిలకల పలుకులు నావేనే ,
అలకల మొలకను నేనేనే ,

శ్రీకృష్ణుని కిష్టం నేనేనే ,
శ్రీకృష్ణసత్యను నే...నే...నే ,

భామనే...సత్యభామనే ,
భామనే...సత్యభామనే .

******






8 comments:

  1. చల్లని తల్లివి నీవేలే
    మమ్ముల రక్షించు మాతల్లి

    ReplyDelete
    Replies
    1. సరే ! మీకు అభయమిదే శర్మ గారు .

      Delete
  2. అందం, పంతం, పౌరుషం, అలక అన్నీ కలబోసిన అమాయకత్వ రూపమే సత్య అందుకే ఆ పతికి ముద్దుల సతి అయింది. అమాయకత్వానికి, అపరిమితమైన ప్రేమ భక్తులకు ఆ పరమాత్మ ఎప్పుడూ బద్దుడే కవిత చాలా బాగుంది

    ReplyDelete
    Replies
    1. పాపం అమాయకమైనది కాబట్టే , జగన్నాధుడు తనకొక్కదానికే సొంతమనుకుని అలకలు పోతూ ,బ్రతిమాలించుకుని తానే గొప్పదని భ్రమలోనే ఉండిపోయేది.అవునా హరితా .

      Delete

  3. సుందరివి సుందరవదనవు .... భామవు .... సత్యభామవు
    పంతం, పౌరుషం నీవు
    చక్కర పలుకుల చిలకవు, విసురు మొలకల అలకవు .... భామవు .... సత్యభామవు
    మమ్ములను రక్షించు చల్లని మా తల్లివి.

    ReplyDelete
    Replies
    1. చంద్రగారూ ! మీకుకూడ ఆ భామా మణి అభయాన్ని అడిగి తీసుకొచ్చాను . అందుకోండి ఆశీస్సులు.

      Delete
  4. పాపం రుక్మిణి :-(( అంతె అణుకువగా ఉంటే అలుసే మరి.

    ReplyDelete
    Replies
    1. తులసిదళంతో తూచిన తల్లి ,అలుసెలా అవుతుంది మీరజ్?ఆమె మానసిక పరిపక్వత కలిగిన తల్లి.

      Delete