వీచే గాలికి , ఊగే ఆకులకు మధ్య స్నేహం వుంది ,
నింగికి , నేలకు మధ్య దూరం వుంది ,
పగటికి , రేయికి మధ్య ఓ ఆశ వుంది ,
నిన్నటికి , నేటికి మధ్య అనుభవం వుంది ,
శబ్ధానికి , నిశ్శబ్ధానికి మధ్య అర్ధం వుంది ,
కథలకి , వ్యధలకి మధ్య జీవితం వుంది ,
నీకూ , నాకూ మధ్య ఎడబాటు వుంది ,
నా మనసులో నిండుగా నీకు తప్ప ....
మరెవరికి చోటుంది ?
నింగికి , నేలకు మధ్య దూరం వుంది ,
పగటికి , రేయికి మధ్య ఓ ఆశ వుంది ,
నిన్నటికి , నేటికి మధ్య అనుభవం వుంది ,
శబ్ధానికి , నిశ్శబ్ధానికి మధ్య అర్ధం వుంది ,
కథలకి , వ్యధలకి మధ్య జీవితం వుంది ,
నీకూ , నాకూ మధ్య ఎడబాటు వుంది ,
నా మనసులో నిండుగా నీకు తప్ప ....
మరెవరికి చోటుంది ?
*******
ఎడబాటుంది అంటూనే నీకే చోతుంది అన్నారంటే ...ఘాటు ప్రేమనే :-)
ReplyDelete" దూరమైన కొలదీ పెరుగును అనురాగం
Deleteవిరహంలోనే వున్నది ఆనందం " అన్నారు
ఒక కవిగారు...నిజమేనేమో పద్మగారు .
మీ అభినందనలకు ధన్యవాదములు .
మనసుకూ, మనసుకూ మధ్య ఎడబాటు వుంటే, ఆ ఎడబాటు పెరిగుతూ, ఒకవేళ వారి భావనల దృష్టి కోణాలలో ఏకత్వం ఉంటే హృదయ స్పందనలు ఆ మనసుల్ని దగ్గరయ్యేందుకు దోహదం చేస్తాయి.
ReplyDeleteఅభినందనలు శ్రీదేవీ!
భావనల దృష్టి కోణంలో ఏకత్వం వుంటే మంచిదే ...లేకపోయినా , చోటివ్వడమనేది ఒక్క స్త్రీకే సాధ్యం . మీ అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు .
Deleteఎడబాటున కూడా మనసున చోటివ్వడం ఆడడానికి మాత్రమే సాధ్యమేమో? మీ కవిత చాలా బాగుంది
ReplyDeleteమీరన్నట్లు ఎడబాటున కూడా చోటివ్వడమనేది ఒక్క స్త్రీకే సాధ్యం . మీ అభినందనలకు ధన్యవాదములు హరితాగారు .
DeleteSridevi gaaru...chaalaa baagaa rasaru.:-):-)
ReplyDeleteకార్తీక్ గారు నా బ్లాగుకు స్వాగతం . మీ అభినందనలకు ధన్యవాదములు .
Deletenice one sridevi:-)
ReplyDeleteశృతి నా బ్లాగుకు స్వాగతం . మీ అభినందనలకు ధన్యవాదములు .
Deleteపగటికీ, రేయికీ మద్య ఓ ఆశ ఉంది కదా, ఆ ఆశ బ్రతికిస్తుంది,
ReplyDeleteశబ్దానికీ,నిశబ్దానికీ మద్య అర్దం ఉంది కదా, అదే మనం మద్య అగాదాలను సృష్టిస్తుంది, ఎదుటి వారి నిశ్శబ్దాన్ని మన శబ్దంతో పోల్చుకొని తిరస్కారమేమో అనుకుంటాం.
మీ కవితల్లో మంచి సందేశం ఉంటుంది,
శబ్దానికీ,నిశబ్దానికీ మద్య అర్దం వుంది
Deleteఅర్ధం అంతరాలను పెరగనీయదు
శబ్దానికీ,నిశబ్దానికీ మద్య దూరం పెరిగితే అర్ధం ....అనర్ధంగా మారుతుంది
అనర్ధాలు అగాధాలు సృష్టిస్తాయి...మీరజ్
మీ అభినందనలకు ధన్యవాదములు .
meaningful analysis...
ReplyDeleteanalytical diagnosis...
thanks for the prescription...
Thanks for your in time analytical awareness sir .
Delete