Tricks and Tips

Thursday, January 9, 2014

నా ఊయలూపగా.........


జో కొట్టి పోవా ఓ చందమామా
ఊహల్లు తేవా అందాలమామా
నా ఊయలూపగా ఓ చందమామా
నా దరి చేరవా అందాలమామా

మల్లెలే నీకై వేచి చూచేనే
జాజులు పూచే జాగు సేయకనే
నీలాల కన్నుల్లో నిదరుంచగా
నా నీలి ముంగురులు సవరించగా

జో కొట్టి పోవా ఓ చందమామా
ఊహల్లు తేవా అందాలమామా
నా ఊయలూపగా ఓ చందమామా 
నా దరి చేరవా అందాలమామా
 
చందన గంధాలు పరిమళించెనే 
పులకింత తెచ్చి ఊసులాడెనే
హృదిలోని ఆశలు వికసించగా
నా అధరాన చిరునవ్వు దరహించగా

జో కొట్టి పోవా ఓ చందమామా
ఊహల్లు తేవా అందాలమామా

నా ఊయలూపగా ఓ చందమామా
నా దరి చేరవా అందాలమామా 
 
ఆనందలోకాన విహరించగా 
అందాల నా మామ అరుదెంచవా
మనసు దోచి నను మాయజేతువా
మరులుగొలిపి నన్ను నిలువనీయవా

జో కొట్టి పోవా ఓ చందమామా
ఊహల్లు తేవా అందాలమామా
నా ఊయలూపగా ఓ చందమామా
నా దరి చేరవా అందాలమామా 

*********

9 comments:



  1. మల్లెలు, జాజులు పూచే నీలాల కన్నులలో నిదురించి నీలి ముంగురులు సవరించగా
    చందన గంధాల పులకింతల ఊసులు హృదిలో ఆశలు చిరునవ్వై దరహించగా
    జో కొట్టి పోవా ఓ చందమామా!
    ఊహల ఊయల లూపగ దరి చేరవా అందాలమామా!
    చక్కని పదాలు, అక్కడక్కడా మంచి పద ప్రయోగాలు .... అందాల మామ వెన్నెల దరహాసం చూస్తున్నట్లుంది. అభినందనలు శ్రీదేవీ!


    ReplyDelete
  2. మీ ఆత్మీయ అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు .

    ReplyDelete
  3. మనసున ఊహలు ఊయలూగెనె .....
    కన్నుల వెన్నెల డోలలూగెనె ......
    ఎంత హాయి ఈ కవిత నిండెనో .....
    ఎంత హాయి ఈ కనుల నిండెనో......
    ఎన్ని నాళ్ళకీ ఊహ పండునో ......

    ReplyDelete
    Replies
    1. ప్రశాంతంగా కళ్ళు మూసుకో గలిగితే , ఆ ఊయల ఎక్కి కలలు పండించుకోవచ్చు హరితా .మీ కవితాపూర్వక అభినందనలకు ధన్యవాదములు .

      Delete
  4. జోకొట్టుతానే ఓ మిణుకు తారా...
    ఊహల్ల ఉయ్యాల ఊపంగ నేను...
    రేయంత తీయంగ నిదురోగ నీవు...
    నీ లేత అధరాన విరబూయ నవ్వు...

    స్నేహపూర్వక అభినందన...

    ReplyDelete
  5. ఒహొహొ ఏం బొమ్మ ఏం బొమ్మ...
    భలే బాగుంది...

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలకు ధన్యవాదములు Nmrao గారు .

      Delete
  6. ఓహూ...గులాబి బాలా అందాల పృఎమ మాలా..... ఊయలలూగుతున్నావా... ఊగు, చదమామే నీ చెంతనున్నాడాయె.

    ReplyDelete
    Replies
    1. ఊహలు ఎప్పుడూ అందంగా , ఆనందంగా వుంటాయి , మీ అభినందన ప్రోత్సాహంతో మరింత ఎక్కువ సేపు ఊగి వస్తా మీరజ్ .

      Delete