కాలగర్భంలో కలసి పోయింది ఒక ఏడాది
నవ వధువులా నడచి వచ్చింది మరో ఏడాది
కొత్త కదా వింత.....అదో గొప్ప అనుభూతిలా .....
ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా .......!
ఆకాశంలో ఏమైనా రెండు చందమామలు ఒచ్చాయా ?
సూర్యుడు ఏమైనా పడమట ఉదయించాడా ?
లేక నిన్నటి సైకోను సైతానొదిలి ,గీతా బోధ చేస్తున్నాడా ?
రాజకీయ నాయకుడు రెండు నాల్కల ధోరణినాపేస్తాడా ?
గోముఖ వ్యాఘ్రాలు తొడుగు తీసివేస్తాయా ?
కృర మానవ జాతి అకౄరుని జపిస్తారా ?
నాగవైష్ణవిని చంపిన వానిని కొలిమిలో వేస్తారా ?
అత్యాచారాలు చేసినవారిని అడ్డంగా నరుకుతారా ?
పసి పిల్లల హంతకుల్ని పీక నులిమి చంపుతారా ?
వరకట్న పిశాచాలకు జన్మఖైదు వేస్తారా ?
అత్తిటి ఆరళ్ళను అణచి వేయగలుగుతారా ?
భార్యుండగానే మరో పెళ్ళి అన్నోణ్ణి చెప్పు తీసి కొడతారా ?
గొప్పవాళ్ళ తప్పుకు కొమ్ముకాయక వదలుతారా ?
జలగల్లాంటి డాక్టర్లు శవాలకు చికిత్సనాపుతారా ?
లంచగొండి నాయకులు నైతికంగ మారతారా ?
మందులేని ఎలక్షన్లకై G.O లు ఇస్తారా ?
మంత్రులంత కలసి స్విస్ ఖాతాలను మూస్తారా ?
విద్యార్ధుల ఆవేశాన్ని పావులాగ వాడుకోరా ?
రాజకీయ రంగు లేకనే ప్రాజెక్టులు కడతారా ?
రామరాజ్యమంటూ రాగాలాప నాపుతారా ?
ఓటు ఉన్న వాడికెల్ల నోటు చూపటమాపుతారా ?
పేదరికం వేళ్ళతో పెకలించి వేస్తారా ?
నిరుద్యోగాన్ని నిర్మూలించేస్తారా ?
దారిద్ర్యం దాపుల్లో లేకుండా చేస్తారా ?
అంతెందుకూ ..........
దాలిగుంట చూస్తే కుక్క వదులుతుందా ?
కర్ర వేసి కట్టినా కుక్క తోక రూపు మారుతుందా ?
నిన్నలాగ కాక మనం నేడు వేరుగుంటామా ?
అలాగే .....
నిన్నటి ఏడాది మాదిరే , ఈ ఏడాది కూడా
అదే విధంగా కాలగర్భంలో కలసి పోతుంది .
కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానిస్తే సరిపోదు ..
ఆశతో ప్రయత్నిస్తేనే మార్పు వస్తుందీ ,
చరిత్రలో చెప్పుకో దగిన స్థానం పొందుతుంది ,
ప్రగతి పథంలో పయనిస్తుంది .
***********
( విలువలకు విలువనిచ్చే వారికి వర్తించదు )
ReplyDeleteనిన్నటి లానే నేడూఅ. అందుకే ఆశతో ప్రయత్నించాలి, చరిత్రలో చెప్పుకో దగిన స్థానం కోసం, ప్రగతి పథంలో పయనించడం కోసం. విలువలకు విలువనిచ్చేందుకు కృషి చేద్దాం.
మంచి మాటలు అన్యపదేశం గా చెప్పడం బాగుంది
అభినందనలు శ్రీదేవి!
మీ అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు శుభోదయం.
Deleteఆలోచనల్లో అక్కచెళ్ళలం అనిపించాము, ఎంతైనా పంతులమ్మలం కదా..:-))
ReplyDeleteపంతులమ్మల ఆలోచనా పంక్తులు
Deleteసహ పంక్తిలో రచనలు చేస్తే
సమపంక్తులవడంతో
ఏ అక్షర పంక్తులయినా
అక్కచెల్లెళ్ళు అవ్వాల్సిందే మీరజ్ .
మీ అభినందనలకు ధన్యవాదములు.
గత ఏడాదిలాగే ఈ ఏడాదీ ఎంతో కొంత పురోగమనం తప్పక ఉంటుందని, మీరు చెప్పిన ఋగ్మతలుకు కొంతైనా అందరం కలసి చికిత్స చేద్దామని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీదేవి గారు.
ReplyDelete